Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ స్టార్ డైరెక్టర్ హోదా అనేది దక్కుతుంది. ఇక రాజమౌళి(Rajamouli) లాంటి దర్శకుడు పాన్ ఇండియా ఇండస్ట్రీ ని శాసిస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరి కొంతమంది దర్శకులు సైతం ఇండియాలో తమ సత్తాను చాటుతున్నారు. రాజమౌళి తర్వాత సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగశ్విన్ లాంటి దర్శకులు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తాను చాటుకున్నారు. ఇక రాబోయే సినిమాలతో మరింత మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా నెంబర్ వన్ దర్శకులుగా మారాలని ప్రతి ఒక్క దర్శకుడు చాలా వరకు తాపత్రయపడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ (Prabhas) ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ హీరోతో ఒక దర్శకుడు చాలా సంవత్సరాల నుంచి సినిమా తీయాలని అనుకుంటున్నప్పటికి అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సుకుమార్…
తన ఎంటైర్ కెరియర్ లో మహేష్ బాబు(Mahesh Babu),రామ్ చరణ్(Ram Charan),అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం మాత్రం తనకు రావడం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రభాస్ బిజీగా ఉంటున్నాడు. ఇక దానికి తోడుగా సుకుమార్ కూడా చాలా బిజీగా ఉండడం వల్ల ఇద్దరి కాంబో అయితే సెట్ అవ్వడం లేదు.
మరి ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ కనక సెట్ అయితే దానికి భారీ క్రేజ్ రావడమే కాకుండా సుకుమార్ ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి సినిమాని డిఫరెంట్ కోణంలో చేసే సుకుమార్ ప్రభాస్ తో చేసే సినిమా మాత్రం మరొక యాంగిల్ లో ఉండేలా చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలైతే జరుగుతున్నాయి…
నిజానికి సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఆయన ఇప్పటికే ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియా రికార్డులను షేక్ చేశాడు. మరి రాబోయే సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు…