Film Industry Politics : ఒక సినిమా స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే దాని కోసం కొన్ని వందల మంది కష్టపడుతుంటారు. మొత్తానికైతే స్క్రీన్ మనకు హీరో, హీరోయిన్ మాత్రమే కనిపిస్తారు. కానీ దాని వెనకాల వాళ్లు ఎప్పటికి కనిపించరు. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ అనేది వ్యాపారం అయిపోయింది. సినిమా మీద ఎవరు ఇంట్రెస్ట్ తో సినిమాలైతే చేయడం లేదు. ఒక సినిమా చేయడం ద్వారా ఎవరికి ఎంత లాభాలు వస్తున్నాయి అనేది ముందే కాలిక్యులేషన్స్ చేసుకొని సినిమాని చేసే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు సినిమా మీద ఇష్టంతో సినిమాలను చేస్తూ లాభాలను సంపాదించేవారు. కానీ ఇప్పుడు లాభాలు రావాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేస్తున్నారు… ఒక సినిమా సక్సెస్ సాధించగానే ఆ సినిమా నా వల్లే సక్సెస్ అయ్యింది అంటూ డైరెక్టర్ గాని, హీరోగాని చెబుతూ ఉంటారు. కానీ దాని వెనక చాలామంది కష్టం ఉందని ఎవరు గుర్తించరు.
ఇక్కడ క్రెడిట్ కోసం పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు… అలానే ఒక స్టార్ డైరెక్టర్ రీసెంట్ గా ఒక స్టార్ హీరో తో సినిమా చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో తప్పు చేశారని అతని మీద కోపంతో అరిచి అతన్ని కొట్టాడట. దాంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి డైరెక్టర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడట.
దాంతో గత కొద్దిరోజుల నుంచి ఆ దర్శకుడు పోలీస్ స్టేషన్ల చూస్తూ తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదంతా తెలుసుకున్న కొంతమంది సినిమా మేధావులు దర్శకుడు అనే వాడికి సినిమా తీయడం మీద విజన్ ఉండాలి. అంతే తప్ప ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెత్తనం చూపిస్తే మాత్రం అది తనకే ప్రమాదకరమని వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఒక సినిమా సక్సెస్ అయినంత మాత్రాన కొమ్ములు వస్తే పనికిరాదని పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్లు తెలిసో తెలియక ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. దాన్ని వీలైనంత వరకు సరిదిద్దె ప్రయత్నం చేయాలి. కానీ నన్ను ఎవ్వరు ఏం చేయలేరని కండ్లు నెత్తికెక్కి ఎవరిని పడితే వారిని కొడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని విమర్శకులు సైతం విమర్శిస్తుండటం విశేషం…