NTR – Prashanth Neel Movie : ‘దేవర’,’వార్ 2′ వంటి చిత్రాల తర్వాత ఎన్టీఆర్(Junior NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో చేస్తున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా షూటింగ్ మొదలై రెండు మూడు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఒక్క పోస్టర్ కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ సినిమా పై కనీవినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్స్ కి అలా కుదిరేస్తాయంతే. అయితే ఈ సినిమా గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం అభిమానులను కలవరపెడుతోంది. ఇప్పటి వరకు తెరకెక్కించిన సన్నివేశాలు జూనియర్ ఎన్టీఆర్ కి అసలు ఏమాత్రం నచ్చలేదని, ఆ సన్నివేశాలు మొత్తం తీసేసి, స్క్రిప్ట్ ని కొత్తగా రాసి, కొత్త కోణం కథతో తెరకెక్కించమని ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
అయితే ప్రశాంత్ నీల్ మాత్రం మళ్లీ కొత్తగా కథ రాసే స్కోప్ ఇప్పుడు లేదు, చేస్తే ఈ కథ తోనే సినిమా చేద్దాం, లేదంటే ఆపేద్దాం అని అన్నాడట. వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం చాలాసేపు జరిగిందని, క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని ఇండస్ట్రీ లో బలంగా వినిపిస్తున్న వార్త. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాకు రెండు మూడు షెడ్యూల్స్ చేసిన తర్వాత, బాగా గ్యాప్ తీసుకుంటాడని, ఆ గ్యాప్ తర్వాత సరికొత్త ఎనర్జీ తో మళ్లీ ఫ్రెష్ గా కొత్త షెడ్యూల్ ని మొదలు పెడతాడని, ఈ సినిమాకు కూడా అదే చేసాడని, కానీ ఈ గ్యాప్ లో పుట్టించాల్సిన పుకార్లు పుట్టించేశారని, ఈ నెలాఖరు నుండి కొత్త షెడ్యూల్ మొదలు అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న వార్త.
అయితే ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ పీఆర్ టీం వెంటనే స్పందించి క్లారిటీ ఇస్తుంది. కానీ ఈ రూమర్స్ ఎప్పటి నుండో సోషల్ మీడియా లో వినిపిస్తున్నప్పటికీ ఎన్టీఆర్ పీఆర్ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంటే ఇదంతా రూమర్స్ కాదు అన్నమాట, నిజమేనా అని అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ చిత్రం పై కోటి ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తామనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడంతో వారిలో జోష్ పూర్తిగా తగ్గిపోయింది. అయితే హిస్టరీ పరిశీలిస్తే ప్రశాంత్ నీల్ తన సినిమాలు ఫైనల్ ఎడిటింగ్ టేబుల్ కి వచ్చేంత వరకు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. సలార్ చిత్రాన్ని కూడా గతం లో అలాగే విడుదల తేదీని వాయిదా వేసి, రీ షూట్స్ చేసి మరీ డిసెంబర్ నెలలో సినిమాని విడుదల చేసాడు. ఈ చిత్రానికి కూడా అదే జరుగుతోంది. చూడాలి మరి ఈ సినిమా స్టేటస్ ఎలా మలుపు తిరగబోతుంది అనేది.