Star Couples: ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న టాప్ సీరియల్లలో ఈ సీరియల్ కూడా ఒకటి. బుల్లితెర మీద సీరియల్స్ లో అలాగే సినిమాలలో కలిసి నటించిన నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఒకప్పుడు కొన్ని సీరియల్లలో కలిసిన వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు గా ఉంటున్నారు. తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతూనే మరోపక్క వృత్తిపరంగా కూడా బిజీగా ఉన్నారు. సినిమాలలో నటించే సమయంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం సహజం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంట కథ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ తెరమీద తల్లి కొడుకులుగా నటించారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. అంతేకాదు ఈ హీరోయిన్ తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైనా నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి బుల్లితెర ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్..కారణం ఏమిటంటే!
ఈ జంట మరెవరో కాదు ప్యార్ కి ఏ ఏక్ కహాని అని హిందీ సీరియల్ లో నటించిన కిశ్వర్ మర్చంట్ మరియు సుయాష్ రాయి. హిందీలో ప్రసారమవుతున్న ప్యార్ కి ఏ ఎక్ కహాని సీరియల్ లో కిశ్వర్ మర్చంట్ తల్లి పాత్రలో నటిస్తుంది. నటుడు సుయాసరాయి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సీరియల్ హిందీలో 2010 నుంచి 2011 వరకు ప్రసారం అయ్యింది. వీరిద్దరి నటనకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారని ఎవరు ఊహించలేదు. కిశ్వర్ మర్చంట్ తనకంటే ఏకంగా 8 ఏళ్లు చిన్నవాడైన సుయాష్ ను పెళ్లి చేసుకుంటానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కిషోర్ మర్చంట్ ముస్లిం అమ్మాయి. సుయాస్ రాయి పంజాబీ కుటుంబానికి చెందిన అబ్బాయి.
అయితే వీళ్ళిద్దరి పెళ్లికి మతం అడ్డు కాలేదు. ప్రేమించుకున్న వీళ్ళిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. సుయాస్ తల్లిదండ్రులు మొదట్లో వీళ్ళిద్దరి పెళ్ళికి నో చెప్పారు. సుయాస్ కు కాబోయే భార్య తనకంటే ఎనిమిదేళ్లు పెద్దది కావడంతో సుయాస్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ వీరిద్దరూ వీరు కుటుంబాలను ఒప్పించి వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ట్రోల్స్ ను కూడా ఎదుర్కొన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న వయసు అంతరాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చాలామంది విమర్శించారు. వీళ్ళిద్దరూ కూడా హిందీలో అనేక సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం వీరిద్దరూ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
View this post on Instagram