Anchor Suma : సుమ కనకాల పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్స్ లో సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన ఉదయభాను, ఝాన్సీ కొంచెం నెమ్మదించారు. సుమ మాత్రం దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్ గా చేశారు. ఓ స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని స్టార్డం ఆమె సొంతం.
పెద్ద పెద్ద హీరోలు కూడా సుమకు గౌరవం ఇస్తారు. కేవలం యాంకర్ గా చూడరు. ఒక మలయాళీ అమ్మాయి తెలుగు యాంకర్ ఈ స్థాయిలో సక్సెస్ కావడం ఊహించని పరిణామం. జాబ్ రీత్యా సుమ తండ్రి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. దాంతో సుమ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమ కెరీర్ మొదలైంది నటిగానే కావడం విశేషం.
కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ హీరోయిన్ గా చేశారు. ఈ చిత్ర హీరో స్టార్ రైటర్ వక్కంతం వంశీ కావడం మరొక విశేషం. దాసరి నారాయణరావు దర్శకుడు కాగా… మూవీ ఆశించినంతగా ఆడలేదు. అనంతరం మలయాళంలో మూడు చిత్రాలు చేశారు. ఆమెకు బ్రేక్ రాలేదు. కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించిన సుమ యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. ఈ రంగంలో సుమకు తిరుగు లేకుండా పోయింది.
సుమ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోయారట. పెళ్ళైతే యాక్టింగ్ మానేయాలని రాజీవ్ కనకాల కండిషన్ పెట్టడంతో సుమ హర్ట్ అయ్యారట. కొన్నాళ్ళు డిస్టెన్స్ మైంటైన్ చేసిందట. మనసు మార్చుకున్న రాజీవ్ నీ ఇష్టమైన రంగం ఎంచుకో నాకు అభ్యంతరం లేదని చెప్పడంతో పెళ్లి చేసుకున్నారట. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్య తెలుగు యాంకర్స్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. దాంతో సుమ కూడా తగ్గడం లేదు. కోటు సూటులో సూపర్ స్టైలిష్ లుక్ సుమ మెస్మరైజ్ చేశారు.
View this post on Instagram