SSMB29: మూస ధోరణిలో వెళ్తున్న ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి కొత్తదనాన్ని అందించిన దర్శకుడు రాజమౌళి… గ్రాఫిక్స్ తో విజువల్ వండర్స్ చేయొచ్చు అని నిరూపించిన ఆయన మనం ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టిన కూడా కథలో కంటెంట్ ఉండి దానిని విజువల్ గా స్క్రీన్ మీద బాగా ప్రజెంట్ చేయగలిగితే ఆ మూవీ భారీ వసూళ్లను సంపాదించి పెడుతుంది అనే ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేశాడు. అలాంటి రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: బీహార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా చంద్రబాబు.. కారణం అదే!
ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. అనేదే ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తోంది అనేదే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 3,000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి ఈ సినిమాకి ఏ టైటిల్ ను నిర్ణయించాడు అనే విషయం మీదనే సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఆయన అసలు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రిజిస్టర్ చేశాడా? లేదా అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. మొత్తానికైతే మీడియా వ్యక్తులందరు ఈ సినిమా టైటిల్ ఏంటి అంటూ జుట్టు పీక్కుంటున్నారు. అయినప్పటికి ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రమే ఎక్కడ కూడా ఒక చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు… ఇక ఈనెల 15వ తేదీన రామోజీ ఫిలిం సిటీ లో 20 కోట్లు పెట్టి ఒక భారీ సెట్ వేసి అందులో ఒక పెద్ద ఈవెంట్ ని కూడా నిర్వహిస్తున్నాడు. ఆ ఈవెంట్ లోనే సినిమాకు సంబంధించిన టైటిల్ రిలీజ్ చేస్తాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఈ ఈవెంట్ ద్వారా రాజమౌళి సినిమాకు సంబంధించిన విశేషాలను ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పటినుంచి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాని మరో విజువల్ వండర్ గా మార్చి వరల్డ్ సినిమా దర్శకులకు సైతం తను పోటీని ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…