Thaman: “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ‘భీమ్లా నాయక్’ సక్సెస్ తో ఫ్యాన్స్ అండ్ టీం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఒక సాంగ్ మాత్రం కనిపించలేదు. నిత్యామీనన్ – పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండే ‘అంత ఇష్టం ఏందయ్యా’ అనే ఒక కూల్ మెలోడీ సాంగ్ చాలా బాగా హిట్ అయ్యింది. సినిమా రిలీజ్ కి ముందే రిలీజ్ అయిన ఈ పాట అద్భుతమైన హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే, సినిమాలో ఈ పాటను తీసేశారు. మంచి హిట్ అయిన ఈ పాటను ఎందుకు తీసేసారు అని సోషల్ మీడియాలో నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ ఈ పాట తొలగింపు పై క్లారిటీ ఇస్తూ.. ‘మంచి వేడి మీద ఉన్న స్టవ్ మీద నీళ్ళు పోస్తే బాగుండదు కదా’ అని తనదైన శైలిలో ఈ పాటను తీసేయడానికి కారణాన్ని చెప్పాడు.
Also Read: మహాశివరాత్రి నాడు మాస్ అవతార్ లో మహేష్ బాబు
అంటే.. సినిమా అప్పటివరకు మంచి వేడి మీద వెరీ ఎమోషనల్ గా కొనసాగుతున్న టైంలో ఈ కూల్ పాట వస్తే.. సినిమా ప్లోకి అడ్డంకిగా అనిపించే ఛాన్స్ ఉంది అని, అందుకే సాంగ్ ను తొలిగించాం అని థమన్ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తున్నా.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సాంగ్ లేదు అని తెగ ఫీల్అయిపోతున్నారు.
మొత్తానికి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భీమ్లానాయక్ ఊపే కనిపిస్తోంది. ఈ సినిమా ప్రభావం బాగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పవన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. బాణాసంచా కాల్చి, డ్యాన్సులు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.

పవన్ సినిమా పై భీమ్లానాయక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం హ్యాపీగా ఉందని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్రివిక్రమ్ రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయన్నాడు.
Also Read: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: 4వ రోజు కలెక్షన్లు ఇవీ
[…] Ram Lingusamy Movie: ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ పోతినేనికి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం రామ్ – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది వారియర్’ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ ను నేడు మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా రామ్ నటిస్తున్నాడు. […]
[…] Also Read: భీమ్లా నాయక్ సినిమా నుంచి ‘అంత ఇష్టం … […]