https://oktelugu.com/

SS Rajamouli Special Story: ‘రాజమౌళి..’ మనిషా ? ఎమోషనల్ మిషనా ?

SS Rajamouli Special Story: ‘రాజమౌళి..’ మనలా మనిషేనా ? లేక, ఎమోషనల్ మిషనా ? ఆయన సినిమాల్లో ఎమోషన్స్ చూస్తే కలిగే సాధారణ అనుమానం ఇది. అసలు పెద్దగా చదువుకొని ఒక సగటు మనిషి, తన విజన్ తో కోట్లాది మంది ఎమోషన్స్ ను ఎలా కదిలించి గలుగుతున్నాడు ? అపజయం అనేది లేకుండా.. రెండు దశాబ్దాలుగా విజయాల పరంపరను ఎలా కొనసాగించ గలుగుతున్నాడు ? ఇవన్నీ సమర్ధవంతంగా చేస్తున్నాడు కాబట్టే.. జక్కన్న క్రియేటివిటీకి బ్రాండ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 12:36 PM IST
    Follow us on

    SS Rajamouli Special Story: ‘రాజమౌళి..’ మనలా మనిషేనా ? లేక, ఎమోషనల్ మిషనా ? ఆయన సినిమాల్లో ఎమోషన్స్ చూస్తే కలిగే సాధారణ అనుమానం ఇది. అసలు పెద్దగా చదువుకొని ఒక సగటు మనిషి, తన విజన్ తో కోట్లాది మంది ఎమోషన్స్ ను ఎలా కదిలించి గలుగుతున్నాడు ?

    SS Rajamouli Special Story

    అపజయం అనేది లేకుండా.. రెండు దశాబ్దాలుగా విజయాల పరంపరను ఎలా కొనసాగించ గలుగుతున్నాడు ? ఇవన్నీ సమర్ధవంతంగా చేస్తున్నాడు కాబట్టే.. జక్కన్న క్రియేటివిటీకి బ్రాండ్ అయ్యాడు, విజువల్ సెన్స్ కి సింబాలిజమ్ అయ్యాడు.

    Also Read: RRR Movie Box Office Collection: ‘ఫస్ట్ డే’నే రికార్డుల బెండు తీసిన ‘ఆర్ఆర్ఆర్’

    కమర్షియల్ సినిమా రాజమౌళిని చూసి పొంగిపోతుంది. రాజమౌళి డైరెక్షన్ చూసి భారీ తనం కూడా చిన్నబోతుంది. అంత గొప్పగా తీస్తాడు సినిమాని. సహజంగానే రాజమౌళి పాత్రల్లో అద్భుతాలు ఉంటాయి. విజువల్ గా కూడా రాజమౌళి యాక్షన్ లో ఎమోషన్ ఉంటుంది. అందుకే.. ‘రాజమౌళి’ అంటే పేరు కాదు, ఇప్పుడు ఒక బ్రాండ్. రాజమౌళి అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కాదు, ఇండియన్ సినిమా ఫేస్.

    SS Rajamouli Special Story

    సినిమా డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ లో ప్రావీణ్యం ఉన్నవాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు. కానీ రాజమౌళి సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కి ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయ్యాడు.

    “మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి..
    మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి…

    రాజమౌళి సార్..

    మీకూ, మాకూ ఒకటే తేడా…
    ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే..” అంటూ సుకుమార్ లాంటి వాళ్ళు కూడా రాజమౌళికి దాసోహం అంటున్నారు.

    రాజమౌళి సృజనాత్మకతకు హద్దు లేదు అంటూ శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా రాజమౌళి టాలెంట్ కి మురిసిపోయారు. రాజమౌళి అంచనాల అసామాన్యుడు అని క్రిష్ పొగిడినా, ‘మీరు అద్భుతం.. మీకు మేము ఏకలవ్య శిష్యులం’ అని ప్రశాంత్ వర్మ, బాబీ లాంటి యంగ్ డైరెక్టర్స్ విస్తుపోయినా రాజమౌళికే చెల్లింది.

    SS Rajamouli Special Story

    పాన్ ఇండియా డైరెక్టర్లు అట్లీ, శంకర్, ప్రశాంత్ కిషోర్ లు కూడా రాజమౌళికి ఫిదా అయిపోయారు. రాజమౌళి సార్.. భావోద్వేగాలతో నా హృదయాన్ని తాకారు.’ అని అట్లీ.., రాజమౌళి సార్ మీరు ఈ రేంజ్ సినిమాను అందించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు’ అని ప్రశాంత్ కిషోర్.., ‘మా అంచనాలను నిలబెట్టిన ‘మహా రాజ’మౌళికి అభినందనలు’ అంటూ శంకర్ జక్కన్న పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పట్లో ఇక రాజమౌళికి ఇక తిరుగు లేదు. అందుకే, రాజమౌళి.. సక్సెస్ కి కెప్టెన్ ఆఫ్ ది షిప్ !

    Also Read: RRR: అందుకే, రాజమౌళి చరణ్ ను హైలైట్ చేశాడు

    Tags