Site icon OkTelugu

SS Rajamouli Son Karthikeya Director Debut: రాజమౌళి కొడుకు కార్తికేయ తొందర్లో డైరెక్టర్ గా మారబోతున్నాడా..? ఆ స్టార్ హీరో డేట్స్ కూడా ఇచ్చాడా..?

SS Rajamouli Son Karthikeya

SS Rajamouli Son Karthikeya

SS Rajamouli Son Karthikeya Director Debut: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన బాహుబలి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఏంటో రుచి చూపించింది. అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వీలైనంత తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేసి అనుకున్న డేట్ కి సినిమాని రిలీజ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా ఒక సినిమాను చేస్తున్నాడు. మలయాళం నటుడు ఫాహద్ ఫాజిల్ ను మెయిన్ లీడ్ లో పెట్టి ‘ఆక్సిజన్’ అనే చేస్తున్నాడు. ఈ మూవీ ని కార్తికేయ సింగిల్ గా ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం…అయితే ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్షన్ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక స్టార్ హీరోని సైతం లైన్లో పెట్టాడనే వార్తలైతే వస్తున్నాయి.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ

అక్కినేని అఖిల్ ను హీరోగా రాజమౌళి కొడుకు కార్తికేయ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందట. ఇంతకు ముందు కార్తికేయ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆయన తప్పకుండా ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా చేయగలడంటు రాజమౌళి ఫ్యామిలీతో పాటు అతని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికైతే కార్తికేయ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారితే మాత్రం రాజమౌళి సైతం ఆనందపడతాడు. ఇక ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ సైతం ఫ్లాపుల్లో ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిని కలిపి వదిలేస్తే ఎవరు ఎవరికి సక్సెస్ ని అందిస్తారు. ఎవ్వరు ప్రెజర్ ని ఎత్తుకొని మరి ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లగలరు అనేది చర్చనీయాంశంగా మారింది.

నిజానికి వీళ్ల వెనక రాజమౌళి ఉంటాడు. కాబట్టి సినిమాని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సినిమా ఎలా వస్తుంది. దానికి సంబంధించిన మెలకువలను వాళ్లకు ఇస్తూ సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నం చేస్తాడని మరి కొంతమంది భావిస్తున్నారు. మరి వీళ్ళ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిమీద సరైన క్లారిటి రావాల్సి ఉంది…

Exit mobile version