https://oktelugu.com/

Acharya Pre Release Event: ఆచార్య ముఖ్య అతిది గా తమ్ముడు – సంతోషంలో మెగా ఫ్యాన్స్ !

Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ లు కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. అయితే, మెగా అభిమానులు అందరూ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక దిగ్గజం రాజమౌళి’ రాబోతున్నారు. మరి పవన్ – రాజమౌళి కలిసి వస్తే.. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2022 / 03:46 PM IST
    Follow us on

    Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ లు కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. అయితే, మెగా అభిమానులు అందరూ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక దిగ్గజం రాజమౌళి’ రాబోతున్నారు.

    Rajamouli, Pawan Kalyan

    మరి పవన్ – రాజమౌళి కలిసి వస్తే.. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ లో సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా పవన్ స్పీచ్ ఆల్ టైం రికార్డు స్పీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి మెగా అభిమానులను హ్యాపీ చేయడానికి కొరటాల బాగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది.

    Also Read: Shruti Haasan: శృతి హాసన్ కూడా జాయిన్ అయ్యిందోచ్

    అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్ విషయంలో చిరు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.

    Acharya

    అన్నట్టు ఆచార్యలో చ‌ర‌ణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండ‌బోతుంది. చిరు – చరణ్ మ‌ధ్య ఉండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్‌ 29న స‌మ్మ‌ర్ కానుక‌గా థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ర‌న్ టైం సుమారు 2 గంట‌ల 58 నిమిషాలు ఉండేలా కొర‌టాల ప్లాన్ చేశాడు.

    ‘ఆచార్య’ నుంచి నిన్న రిలీజ్ అయినా ‘సిరుత పులుల సిందాట’ అంటూ సాగే ‘భలే భలే బంజారా’ సాంగ్ ప్రోమో బాగా వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ప్రోమోలో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు స్టెప్స్, ముఖ్యంగా చరణ్ – చిరుకు మధ్య ఉన్న స్టెప్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ఇక మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి.

    Also Read:Radhe Shaym Closing Collections: రాధే శ్యామ్ క్లోసింగ్ కలెక్షన్లు… నష్టాలలో సరికొత్త రికార్డ్

    Recommended Videos:

    Tags