
SS Rajamouli: డైరెక్టర్లు రెండు రకాలు ఉంటారు, స్టార్ల స్టైల్ ను వాడుకుని హిట్ కొట్టేవాళ్లు ఒక రకం, తమ స్టైల్ తో స్టార్ల స్టైల్ నే మార్చే వాళ్ళు రెండో రకం. అయితే, రెండో రకం దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతానికి అయితే, తెలుగులో అలాంటి డైరెక్టర్ ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. హీరోలకు స్టార్డమ్ అందించాలంటే పూరి తర్వాతే ఎవరైనా అనుకోవచ్చు.
అయితే, ఈ మధ్య కాలంలో ఒక్క ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా తప్ప, ఇక పూరి చేసిన మిగిలిన ఏ సినిమా హిట్ కాలేదు, జనాలకు కూడా అసలు ఎక్కలేదు. పైగా పూరి ఫ్యాన్స్ కు కూడా ఆ సినిమాలు నచ్చలేదు. అందుకే, స్టార్ హీరోలు కూడా పూరికి డేట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూరి గొప్పోడు అనేలా రాజమౌళి కామెంట్స్ ఉండటంతో మొత్తానికి పూరికి ఒక విలువ వచ్చినట్టు అయింది.
అయినా ఉన్నపళంగా రాజమౌళి(SS Rajamouli), పూరి గురించి ఏదో మొహమాటానికి మాట్లాడలేదు. పూరీలోని ప్రత్యేకతను గుర్తు చేశాడు అంతే. ముఖ్యంగా ఒకప్పటి పూరిని గుర్తుచేశాడు. అవును, ఒకప్పటి పూరి నిజంగా గ్రేటే. ఎందుకంటే హీరోలకు కొత్తరకం యాక్టింగ్ నేర్పిన గురువు పూరి. ఇదే విషయం గురించి ప్రభాస్ ను ఉదాహరణగా చెబుతూ రాజమౌళి బాగా మాట్లాడాడు.
నటుడిగా ప్రభాస్ లో ఎలాంటి చెంజోవర్ ఉంది ? అనే ప్రశ్నకు.. చాలా ఛేంజ్ ఉంది.. అంటూ ముఖ్యంగా ‘బుజ్జి గాడు’ సినిమాతో ప్రభాస్ చాలా మారాడు. అయితే ప్రభాస్ లో బిగ్గెస్ట్ ఛేంజ్ తీసుకొచ్చింది పూరినే. ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా అందరి హీరోలకు ఒక ఛేంజోవర్ తీసుకొచ్చిన క్రెడిట్ పూరికే దక్కుతుంది.
స్టార్ హీరోలను యూత్ కి బాగా దగ్గర చేసిన ఘనత పూరి జగన్నాథ్ దే’ పూరి పూర్వ వైభవం తాలూకు పరిమళాన్ని రాజమౌళి చాలా చక్కగా చెప్పాడు. అయితే రాజమౌళి గొప్పగానే చెప్పినా ఇప్పుడు పూరిలో ఆ గొప్పతనమే లేదు. పూరిలో అప్పటి ప్రతిభ మిస్ అయింది.
Also Read: ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ పై హీరో రానా స్పందన.. కొత్త వివాదం