https://oktelugu.com/

BigBoss: ‘బిగ్​బాస్’​ హోస్ట్​గా శ్రుతి హాసన్​.. కారణం ఇదేనా?

BigBoss: కమల్​హాసన్​ కుమార్తెగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకున్న నటి శ్రుతి హాసన్​. వరుస చిత్రాలతో దూసుకెళ్లి.. టాప్​ హీరోయిన్లలో ఒకరిగా హవా సాగిస్తోంది. కాగా, ఇటీవలే తెలుగులో క్రాక్​ సినిమాతో హిట్​ కొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలయ్య సరసన నటించేందుకు సిద్ధమైంది. అనిల్​రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసింది శ్రుతి. అయితే, ఇప్పుడు విషయం ఏంటంటే.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 12:26 PM IST
    Follow us on

    BigBoss: కమల్​హాసన్​ కుమార్తెగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకున్న నటి శ్రుతి హాసన్​. వరుస చిత్రాలతో దూసుకెళ్లి.. టాప్​ హీరోయిన్లలో ఒకరిగా హవా సాగిస్తోంది. కాగా, ఇటీవలే తెలుగులో క్రాక్​ సినిమాతో హిట్​ కొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలయ్య సరసన నటించేందుకు సిద్ధమైంది. అనిల్​రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసింది శ్రుతి.

    అయితే, ఇప్పుడు విషయం ఏంటంటే.. హీరో కమల్​హాసన్​ తమిళంలో బిగ్​బాస్​ షోకు హోస్ట్​గా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం విక్రమ్​ సినిమా షూటింగ్​ నిమిత్తం యూరప్​ వెళ్లగా.. ఆయనకు కరోనా సోకింది. ప్రస్తుతం షూటింగ్​ కూడా నిలిపేశారు. ఇటువంటి తరుణంలో బిగ్​బాస్ పరిస్థితి ఏంటని తమిళ ప్రేక్షకుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే, దీనికి షో నిర్వహకులు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది. కమల్ కరోనా నుంచి కోలుకుని వచ్చే వరకు ఆయన స్థానాన్ని శ్రుతి హాసన్ భర్తీ చేయనున్నట్లు సమాచారం.

    ఈ క్రమంలోనే తమిళ బిగ్​బాస్​ షోకు శ్రుతి హాసన్​ హోస్ట్​గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.  సింగర్​, నటి, ర్యాపర్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి.. ఇప్పుడు హోస్ట్​గా మారి తనలోని టాలెంట్​ను ఎలా బయటపెట్టబోతుందో తెలియాల్సి ఉంది. అయితే, ఇంకా ఈ విషయంపై శ్రుతి హాసన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని టాక్​.

    కమల్​ హాసన్​ హీరోగా లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా విక్రమ్​. ఇందులో కమల్​ విక్రమ్​ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కమల్​తో పాటు ఫాహద్​ ఫాజిల్​, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.