Sruthi Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది శృతి హాసన్. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్గా కొనసాగిన శ్రుతి హాసన్.. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలోనే ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి సినిమాలను వదిలేసింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి… ఇటీవల రవితేజా సరసన “క్రాక్” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ సరసన “వకీల్ సాబ్” సినిమాలో నటించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన “సలార్”, బాలయ్య 107 సినిమాలో నటిస్తోంది.

కాగా ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు శృతి. అందులో ఒకరు ‘టీనేజర్ అబ్బాయితో డేటింగ్ చేస్తారా’ అని ఒక అభిమాని అడిగాడు. అందుకు బదులుగా ఆమె “నో ఎందుకంటే అలా చేయడం ఇల్లీగల్. అది మొదటి కారణం అయితే, మరో ముఖ్యమైన కారణం ఏంటంటే అది చాలా అసహజంగా ఉంటుంది. మీ ప్రశ్న కూడా చాలా అసహజంగా ఉంది” అని సమాధానం ఇచ్చారు. ‘ఇరవై ఏళ్ల శ్రుతీకి ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు’ అని మరొకరు ప్రశ్నిస్తే “ఇతరుల కోసం చేంజ్ అవ్వొద్దు. మంచి కోసం మారండి. చిల్ అవుట్” అని చెప్పింది భామ. ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అని ఒకరు అడిగారు. ‘నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చా’ అని శృతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. అలానే ఇతర మహిళలకు మద్దతుగా నిలవని మహిళలను చూసినప్పుడు తనకు కోపం వస్తుందని ఈ ముద్దుగుమ్మ తెలిపింది.