Srireddy : శ్రీరెడ్డి పరిశ్రమలో అడుగుపెట్టి చాలా కాలం అవుతుంది. ఆమె కొన్ని స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో నటించింది. మీటూ కామెంట్స్ తో శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చింది. అలాగే మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వం, అవకాశాల కోసం ఆమె ఉద్యమం చేసింది. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసింది. ఈ ఘటనను నేషనల్ మీడియా సైతం కవర్ చేసింది. శ్రీరెడ్డి ప్రతిపాదనపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించింది.
ఇక పలువురు టాలీవుడ్ నటులు, దర్శకులు, స్టార్ కిడ్స్ మీద శ్రీరెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అవకాశాలు ఇప్పిస్తామని శారీరకంగా వాడుకున్నారని ఆమె ఓపెన్ అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు శ్రీరెడ్డి లీక్ చేసింది. అభిరామ్ కి తనకు శారీరక సంబంధం ఉందని ఆమె కుండబద్దలు కొట్టింది.
శ్రీరెడ్డి పొలిటికల్ కామెంట్స్ కూడా చేస్తుంది. ఆమె పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లను ఏకిపారేసిన సందర్భాలు అనేకం. బూతులు తిడుతూ వారి అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీరెడ్డికి జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఆమె మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పెట్టే సందేశాలను యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు.
చాలా కాలంగా శ్రీరెడ్డి చెన్నైలోనే ఉంటుంది. ఒకప్పటిలా ఆమెను జనాలు పట్టించుకోవడం లేదు. పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. ఆ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టి వంటల వీడియోలు చేసింది. వాటికి పెద్దగా ఆదరణ రాలేదు. ఇదిలా ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం సంచలనంగా మారింది. తనకు చనిపోవాలని ఉంది ఉంటున్న శ్రీరెడ్డి… అందుకు కారణాలు చెప్పుకొచ్చింది.
శ్రీరెడ్డి మాట్లాడుతూ.. నేను మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యాను. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ఆత్మహత్య చేసుకుంటే.. అందుకు మీడియా, టీడీపీ, జనసేన పార్టీలే కారణం. ఇంకా ఎన్ని రోజులు బ్రతికి ఉంటానో నాకు తెలియదు. ఆ ఆలోచనల నుండి బయటకు రావాలని ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావడం లేదు. నన్ను ఇంకా ఆ భద్రకాళి కాపాడాలి.. అని అన్నారు.
శ్రీరెడ్డి సెన్సేషన్ కోసం, మీడియాలో హైలెట్ అయ్యేందుకు ఈ ట్రిక్ ప్లే చేసిందా? లేక నిజంగానే ఆమె ఒత్తిడికి గురవుతున్నారా? అనేది తెలియదు. చాలా స్ట్రాంగ్ గా ఉండే శ్రీరెడ్డి తీవ్రమైన సోషల్ మీడియా వ్యతిరేకతను ఫేస్ చేస్తుంది. ఇది చాలా కాలంగా జరుగుతుంది. సోషల్ మీడియా వేధింపులు ఆమెకు కొత్తేమీ కాదు. మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అనేది చూడాలి.
ఇక శ్రీరెడ్డి కామెంట్స్ పై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె అభిమానులు అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. మంచి వైద్యుడిని కలిస్తే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం అంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మొత్తంగా శ్రీరెడ్డి మరో వివాదానికి తెరలేపింది.
Web Title: Srireddy sensational comments shaking internet in a big time
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com