
Avasarala srinivas: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే సినిమాతో కామెడీ పంచిన హీరో, నటుడు అవసరాల శ్రీనివాస్. ఇటీవల ఈయన నటించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంది. ‘అష్టా చమ్మా’ అనేసినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్ ఆ తర్వాత దర్శకుడిగా, రైటర్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా కూడా పనిచేశాడు.
ఒకవైపు నటుడిగానే కాకుండా మరోవైపు దర్శకుడిగా కూడా అడుగులు వేస్తున్న అవసరాల శ్రీనివాస్ తాజాగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే మరో డిఫెరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బట్టతల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కథను అవసరాలే రాసుకోవడం గమనార్హం.
‘అలీతో సరదాగా’ అనే టాక్ షోకు అతిథిగా వచ్చిన అవసరాల శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న అనుభవాలను అలీతో పంచుకున్నాడు. తన మొదటి సినిమా ‘అష్టాచమ్మా’ సినిమా విడుదలైన అనంతరం ఒక పెద్ద హీరో సినిమా చూసి ఫోన్ చేస్తే కొంతసేపటి వరకు ఆయన ఎవరో గుర్తు పట్టలేదని.. చివరకు ఫోన్ పెట్టే సమయంలో ‘సార్ మీ పేరు ఏమిటి?’ అని అడగగానే ‘నా పేరు రవితేజ అంటారండి’ అని చెప్పడంతో షాక్ అయ్యానని అవసరాల తెలిపారు.
అమెరికాలో జాబ్ వదలుకొని తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా సినిమాలంటే పిచ్చి ప్రేమతో వచ్చానని..గతంలో కొన్ని సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్టు అలీ షోలో అవసరాలు శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా కోసం బట్టతల ఉండాలని స్వయంగా గుండు చేసుకున్నట్టు అవసరాల తెలిపాడు. ఆ సినిమా బాగా ఆడడం కోసమే ఇలా చేశానని తెలిపాడు.
ఒకసారి ఫోర్జరీ చేసి దొరికిన తర్వాత మళ్లీ అలాంటి పనులు చేయలేదని.. ఒక అయిదారుగురు ముఖ్యమైన వారి సంతకాలు ఫోర్జరీ చేసినట్టు అవసరాల శ్రీనివాస్ తెలిపాడు. ‘నూటొక్క జిల్లాల ’ సినిమా కోసం ఒక బట్టతల వివాదాస్పద వీడియోను కావాలనే చేశామని అవసరాల చెప్పుకొచ్చాడు.