Anchor Srimukhi : లేత గులాబీనే వాడిపోయేలా చేస్తోన్న శ్రీముఖి అందం.. వైరల్ ఫొటోలు

ప్రస్తుతం బిగ్ బాస్ తర్వాత ఫుల్ యాంకర్ గా బుల్లితెరకే శ్రీముఖి అంకితమైంది. మధ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది.. ప్రస్తుతం బుల్లితెరపై ఫుల్ స్వింగ్ లో ఉన్న శ్రీముఖి మధ్యలో ఇలా అందాలు ఆరబోస్తోంది.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ వైరల్ వైరల్ అవుతున్నాయి..

Written By: NARESH, Updated On : January 1, 2024 10:51 am
Follow us on

Anchor Srimukhi : లేత గులాబీల డ్రెస్సులో యాంకర్ శ్రీముఖి అందాల హొయలు చూడముచ్చటగా ఉన్నాయి..పింక్ కలర్ లో అచ్చం దేవకన్యలా శ్రీముఖి దర్శనమిచ్చింది.అదిరిపోయే డ్రెస్ తో కొత్త సంవత్సరం వేళ నెటిజన్లకు వీనుల విందు పంచింది..

ప్రస్తుతం బిగ్ బాస్ తర్వాత ఫుల్ యాంకర్ గా బుల్లితెరకే శ్రీముఖి అంకితమైంది. మధ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది.. ప్రస్తుతం బుల్లితెరపై ఫుల్ స్వింగ్ లో ఉన్న శ్రీముఖి మధ్యలో ఇలా అందాలు ఆరబోస్తోంది.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ వైరల్ వైరల్ అవుతున్నాయి..

శ్రీముఖి హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చింది. అయితే అవకాశాలు రాలేదు. పైగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు కూడా ఎదురయ్యాయట. లాభం లేదని శ్రీముఖి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. పటాస్ షోతో శ్రీముఖి పాప్యులర్ అయ్యింది. యాంకర్ రవితో పాటు పటాస్ షోకి ఆమె యాంకర్ గా వ్యవహరించారు. పటాస్ పర్లేదు అనిపించుకుంది.

బుల్లితెరపై ఎదుగుతున్న రోజుల్లో శ్రీముఖి బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. 2019లో ప్రసారమైన సీజన్ 3లో శ్రీముఖి కంటెస్ట్ చేసింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా టైటిల్ రేసులో నిలిచింది. సీజన్ 3 టైటిల్ కోసం సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి పోటీపడ్డారు. తృటిలో టైటిల్ చేజార్చుకున్న శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. ప్రైజ్ మనీ మిస్ అయినా… రెమ్యునరేషన్ రూపంలో శ్రీముఖి గట్టిగా రాబట్టిందని సమాచారం.