Homeఎంటర్టైన్మెంట్Srilila : శ్రీలీల అందం పై ఆసక్తికర చర్చ, అందుకు పాల్పడిందా?

Srilila : శ్రీలీల అందం పై ఆసక్తికర చర్చ, అందుకు పాల్పడిందా?

Srilila : పాతికేళ్ళు నిండకుండానే ఇండస్ట్రీ ఊపేస్తోంది శ్రీలీల. ముఖ్యంగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె వెనకపడుతున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి బడా స్టార్స్ తో జతకట్టింది శ్రీలీల. ఇక బాలయ్యకు కూతురిగా భగవంత్ కేసరి చిత్రం చేసింది. శ్రీలీల టాలీవుడ్ లో అడుగుపెట్టాక కొందరు హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయ్యారు. వారి ఆఫర్స్ మొత్తం శ్రీలీల లాగేసుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా శ్రీలీలకు ఆఫర్స్ వస్తున్నాయి. శ్రీలీల హిట్ పెర్సెంటేజ్ కూడా తక్కువే.

అయితే శ్రీలీల ఎనర్జీ, గ్లామర్ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. అలాగే శ్రీలీల మంచి డాన్సర్ కావడం కలిసొస్తుంది. పుష్ప 2 ఐటెం సాంగ్ లో శ్రీలీల తనలోని హాట్ యాంగిల్ పరిచయం చేసింది. ప్రస్తుతం శ్రీలీల మాస్ జాతర చిత్రం చేస్తుంది. రవితేజకు జంటగా మరోసారి నటిస్తుంది. గతంలో శ్రీలీల-రవితేజ కాంబోలో ధమాకా తెరకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే హిందీలో ఆషీకీ 3 చేస్తుంది. తమిళ్ లో కూడా శ్రీలీల ఎంట్రీ ఇస్తుంది.

Also Read : ఇక జీవితంలో మళ్ళీ అలాంటి పొరపాటు చేయను..ఇదే చివరిసారి అంటూ శ్రీలీల ఎమోషనల్ కామెంట్స్!

చెప్పాలంటే శ్రీలీల కెరీర్ జోరుగానే ఉంది. కాగా ఆమె అందం కోసం సర్జరీకి పాల్పడ్డారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. సహజంగా అందంగా ఉండేందుకు హీరోయిన్స్ వ్యాయామం, యోగ చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. అలాగే సర్జరీలు కూడా చేయించుకుంటారు. శ్రీదేవి వంటి అతిలోక సుందరి సైతం ముక్కు సర్జరీ చేయించుకుందనే టాక్ ఉంది. జాన్వీ కపూర్ కూడా సర్జరీకి పాల్పడిందట.

తాజాగా శ్రీలీల సర్జరీ చేయించుకుందని అంటున్నారు. తన పెదాలను అందంగా మలుచుకోవడం కోసం శ్రీలీల లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల లేటెస్ట్ లుక్ పరిశీలిస్తే ఆమె పెదాలు గతంలో కంటే పెద్దవిగా కనిపిస్తున్నాయని అంటున్నారు. మరి ఈ వాదనల్లో నిజమెంతో తెలియదు. ఇక సర్జరీ పుకార్లపై శ్రీలీల స్పందించాల్సి ఉంది. కాగా శ్రీలీల లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ నిరాశపరిచింది.

Also Read : బాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల ప్రేమాయణం..అధికారికంగా ప్రకటించిన స్టార్ నిర్మాత!

RELATED ARTICLES

Most Popular