https://oktelugu.com/

Srileela : ఆ పని చేస్తున్న శ్రీలీల.. ఆఫర్స్ తగ్గడంతోనే అంటూ..!!

అందం, అభినయంతోనే కాకుండా అద్భుతమైన నటన, డ్యాన్స్ తో యూత్ మనసులో శ్రీలీల స్థానం సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాకుండా శ్రీ లీల ఈ మధ్య వరుసగా ఫొటో షూట్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే శ్రీలలకు సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 23, 2024 / 09:33 PM IST

    sreeleela

    Follow us on

    Srileela : తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల భామ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ మధ్య ఎక్కడా విన్న ఆమె పేరే వినిపిస్తుంది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమాలో దాదాపు తనే కథనాయకగా కనిపించింది. టాలీవుడ్ లో ఈ ముద్ధుగుమ్మకు ఉన్న క్రేజ్ మామూలుది కాదని చెప్పుకోవచ్చు.

    దర్శకుడు రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి ఆఫర్లను అందుకుంది. స్టార్ హీరోల పక్కన ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫేమ్ సంపాదించింది. మాస్ మహారాజ రవితేజ, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి హీరోలతో కలిసి నటించింది.

    అందం, అభినయంతోనే కాకుండా అద్భుతమైన నటన, డ్యాన్స్ తో యూత్ మనసులో శ్రీలీల స్థానం సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాకుండా శ్రీ లీల ఈ మధ్య వరుసగా ఫొటో షూట్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే శ్రీలలకు సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

    ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన సినిమాలు అన్నీ అనుకున్న విజయాలను సాధించలేకపోయాయి. దీంతో ఈ అందాల భామ చిత్ర పరిశ్రమలో ఐరన్ లెగ్ అయిపోయిందని , అందుకే అమ్మడుకు సినీ ఆఫర్స్ సరిగా రావడం లేదంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీలీల ప్రస్తుతం ఖాళీగా ఉంటుందని, ఆరు నెలలుగా ఆమెకు ఆఫర్సే లేవంటూ గుసగుసలాడుతున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా శ్రీలీల స్టడీస్ పై దృష్టి పెట్టడంతో పాటు ఫ్రెండ్స్ తో చిల్ అవడం, జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేయడం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.