https://oktelugu.com/

Bhagavanth Kesari : భగవంత్ కేసరిలో కాజల్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీలీల.. ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

కాజల్ తో పోలిస్తే.. శ్రీలీల రెమ్యూనరేషన్ ఎక్కువ అని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమా కోసం కాజల్ అగర్వాల్ 1.05 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోగా శ్రీ లీల

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2023 / 01:01 PM IST
    Follow us on

    Bhagavanth Kesari : దసరా కానుకగా వచ్చి థియేటర్లను ఊపేస్తున్న సినిమా భగవంత్ కేసరి. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాలో కాజల్, శ్రీలీలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకుంది. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు బాలయ్య అభిమానులు. ఇప్పటికే మంచి కలెక్షన్లతో దూసుకొని పోతూ.. అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది ఈ సినిమా.

    ఇందులో ఇద్దరు హీరోయిన్ లు అని చెప్పుకున్నాం.. కాజల్ బాలయ్యతో జతకడితే శ్రీలీల వీరి కూతురు పాత్రలో నటించింది. మరి ఇలా ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలు కూడా హిట్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ఇద్దరిలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత అనేది కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా గురించి కూడా ఇదే టాక్ నడుస్తోంది. ఓ వైపు కాజల్ అగర్వాల్ సీనియర్ నటి, కానీ శ్రీలీల మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించిన నటి. ఇద్దరికి క్రేజ్ ఓ రేంజ్ లో ఉన్నా.. ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తోందనే చెప్పాలి. కాజల్ కరోనా, పెళ్లి, పిల్లలు అని గ్యాప్ ఇచ్చి ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

    కాజల్ తో పోలిస్తే.. శ్రీలీల రెమ్యూనరేషన్ ఎక్కువ అని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమా కోసం కాజల్ అగర్వాల్ 1.05 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోగా శ్రీ లీల రూ. 1.08 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. దీంతో కాజల్ అగర్వాల్ తో పోలిస్తే నటి శ్రీ లీల రెమ్యూనరేషన్ అధికంగా ఉందని చెప్పాలి.

    కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం కారణంగానే ఈమెకు రెమ్యూనరేషన్ పూర్తిగా తగ్గించారు అని టాక్. ఇదిలా ఉంటే.. శ్రీలీల భగవంత్ కేసరి సినిమాకు ధమాకా సినిమా షూటింగ్ సమయంలో కమిట్ అయిందట. దీంతో రెండు కోట్లలోపు రెమ్యూనరేషన్ ఇచ్చారట.. కానీ ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో విజ్జి పాప పాత్రలో శ్రీ లీల ఎంతో అద్భుతంగా నటించారు. కానీ మొత్తం మీద హీరోయిన్ కంటే కూతురు పాత్రలో నటించిన శ్రీలీలనే అధికంగా రెమ్యూనరేషన్ అందుకుంది.