https://oktelugu.com/

Sridevi Soda Center Telugu Movie: ఫ‌స్ట్ డే.. ఊహించ‌ని క‌లెక్ష‌న్స్‌.!

Sridevi Soda Center Telugu Movie:  టాలీవుడ్లో ఈ వారం నాలుగు చిత్రాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో.. వివాహ భోజ‌నంబు, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు, హౌస్ అరెస్ట్‌, శ్రీదేవి సోడా సెంట‌ర్ ఉన్నాయి. అయితే.. వివాహ భోజ‌నంబు ఓటీటీలో రిలీజ్ కావ‌డంతో బాక్సాఫీస్ రేసులో లేదు. మిగిలిన మూడు చిత్రాల్లో మొద‌టి నుంచీ అంచ‌నాలు ఉన్న చిత్రం శ్రీదేవీ సోడా సెంట‌ర్‌. మ‌రి, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యం న‌మోదు చేసే అవ‌కాశం ఉంది? తొలిరోజు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 28, 2021 / 08:44 AM IST
    Follow us on

    Sridevi Soda Center Telugu Movie:  టాలీవుడ్లో ఈ వారం నాలుగు చిత్రాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో.. వివాహ భోజ‌నంబు, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు, హౌస్ అరెస్ట్‌, శ్రీదేవి సోడా సెంట‌ర్ ఉన్నాయి. అయితే.. వివాహ భోజ‌నంబు ఓటీటీలో రిలీజ్ కావ‌డంతో బాక్సాఫీస్ రేసులో లేదు. మిగిలిన మూడు చిత్రాల్లో మొద‌టి నుంచీ అంచ‌నాలు ఉన్న చిత్రం శ్రీదేవీ సోడా సెంట‌ర్‌. మ‌రి, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యం న‌మోదు చేసే అవ‌కాశం ఉంది? తొలిరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అన్న‌ది చూద్దాం.

    ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన న‌టుడు సుధీర్ బాబు. సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి చాలా కాల‌మైనా.. సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ రేంజ్ త‌గిన హిట్ సుధీర్ ఖాతాలో ప‌డ‌లేదు. చాలా ప్ర‌య‌త్నాలే చేసినా.. ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. అయిన‌ప్ప‌టికీ దండ‌యాత్ర‌లు చేస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది శ్రీదేవీ సోడా సెంట‌ర్‌.

    ఈ సినిమా మొద‌టి నుంచీ వార్త‌ల్లో ఉంది. ప్ర‌మోష‌న్ కూడా బాగానే చేశారు. దీంతో.. శ్రీదేవీ సోడా సెంట‌ర్ పై అంచ‌నాలు పెరిగాయి. దాదాపు 8 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం.. ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం గ‌ట్టిగానే చేసింది. డిజిట‌ల్‌, శాటిలైట్ ఇత‌ర బిజినెస్ రూపంలో 12.5 కోట్ల మేర ద‌క్కిన‌ట్టు ట్రేడ్ అంచ‌నా. థియేట్రిక‌ల్ బిజినెస్ రూపంలో మ‌రో 8 కోట్లు అందిన‌ట్టు స‌మాచారం.

    ఈ విధంగా భారీ బిజినెస్ తో ఈ నెల 27న‌ థియేట‌ర్లోకి దూసుకొచ్చిన శ్రీదేవీ సోడా సెంట‌ర్‌.. తొలిరోజు ఎంత క‌లెక్ష‌న్ వ‌సూలు చేసింద‌న్న‌ది చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 500 థియేట‌ర్ల‌లో రిలీజైంది. తెలంగాణ‌లో 200, ఆంధ్రాలో 300 థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అయితే.. సినిమాకు రివ్యూలు పాజిటివ్ గానే వ‌చ్చాయి. మౌత్ ప‌బ్లిసిటీ కూడా ఫ‌ర్వాలేదు అన్న‌ట్టుగానే ఉంది. ఈ నేప‌థ్యంలో.. తొలి రోజు ఈ చిత్రం దాదాపు 1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల మేర వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. మ‌రి, ఏ మేర‌కు క‌లెక్ష‌న్లు సాధిస్తుంద‌న్న‌ది వీకెండ్ ముగిస్తే తేలిపోతుంది.