Sudigali Sudheer: ఈటీవీ వేదికగా సుడిగాలి సుధీర్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మల్లెమాల ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన జబర్దస్త్, ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీల టీఆర్పీ పరుగులు పెట్టించాడు. తన మల్టీ టాలెంట్స్ తో ప్రతి షోలో ప్రత్యేకంగా నిలిచాడు. బుల్లితెర స్టార్ గా అవతరించిన సుడిగాలి సుధీర్ కోసమే షో చూసే వారి సంఖ్య పెరిగింది. ఏళ్ల తరబడి తన టీమ్ సభ్యులు గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ లతో కలిసి జబర్దస్త్ ని భుజాలపై మోశాడు. ఎపిసోడ్ మొత్తానికి సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ హైలెట్ గా నిలిచేది. హైపర్ ఆది వచ్చే వరకూ సుడిగాలి సుధీర్ టీమ్ కి పోటీ ఇచ్చిన టీమే లేదు.

ఇక ఢీ షోకి వెళ్ళాక సుధీర్ ఇమేజ్ మరింత ఎలివేట్ అయ్యింది. యాంకర్ రష్మీ గౌతమ్ తో లవ్ ట్రాక్స్ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాయి. వీరిద్దరి రొమాన్స్ ,కెమిస్ట్రీ ఢీ షోకి అదనపు ఆకర్షణ. అలాగే సుధీర్ సింగర్ గా, మెజీషియన్ గా, డాన్సర్ గా, యాంకర్ గా, కమెడియన్ గా మల్టీ టాలెంట్స్ చూపిస్తూ ఢీ రియాలిటీ షో స్వరూపమే మార్చేశాడు. ఢీ-జబర్దస్త్ మిక్స్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో కొత్త షో స్టార్ట్ చేశారు. దానికి సుధీర్ ని యాంకర్ ని చేశారు. అతి తక్కువ కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ గుర్తింపు తెచ్చింది.
సుధీర్ భాగమైన మల్లెమాల షోస్ మంచి టీఆర్పీ రాబట్టాయి. కారణం తెలియదు కానీ సుధీర్ మెల్లగా ఒక్కో షో వదులుకుంటూ వచ్చారు. మొదట ఢీ, తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ నుండి తప్పుకున్నాడు. ఇది అభిమానులను నిరాశపరిచింది. మల్లెమాల వాళ్లతో సుధీర్ కి విబేధాలు తలెత్తాయని అందుకే వాళ్ళ షోస్ నుండి బయటకు వెళ్లిపోయాడన్న ప్రచారం జరిగింది. ఎన్ని కథనాలు వచ్చినా సుధీర్ నోరు మెదపలేదు.ఇటీవల గాలోడు ట్రైలర్ విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సుధీర్ స్పష్టత ఇచ్చాడు.

మల్లెమాల వాళ్లతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. ఆరు నెలలు బ్రేక్ అడిగాను. త్వరలోనే జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇస్తానని సుధీర్ చెప్పుకొచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన రోజుల వ్యవధిలో సుధీర్ అన్నంత పని చేశాడు. సుధీర్ రీఎంట్రీ ఇచ్చాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా సుధీర్ పాల్గొన్నాడు. ఆయనకు టీమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రష్మీతో పాటు సుధీర్ యాంకరింగ్ తో అల్లాడించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో వైరల్ అవుతుంది. సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంటే అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుధీర్ లేటెస్ట్ మూవీ గాలోడు నవంబర్ 18న విడుదల కానుంది.