Waltair Veerayya – Nikhil: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా సాగుతుంది..ప్రముఖ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు..చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథ తో మన ముందుకి రాబోతుండడం తో అభిమానుల్లో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ దీపావళి కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

ఇక ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతుంది మూవీ టీం..దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన నాలుగు మాస్ సాంగ్స్ ఫాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉండబోతున్నాయట..ప్రస్తుతం శేఖర్ మాస్టర్ అద్వర్యం లో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు..హైదరాబాద్ నగర శివార్లలలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుంది.
అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక టాక్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించేలా చేస్తుంది..అదేమిటి అంటే ఈ చిత్రం లో కుర్ర హీరో నిఖిల్ కూడా ఒక ముఖ్యమైన క్యారక్టర్ చేస్తునట్టు సమాచారం..యంగ్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన కనిపించబోతున్నాడట..రీసెంట్ గా కార్తికేయ 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించుకున్న నిఖిల్ ఈ సినిమాలో ఉండడం వల్ల కచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

అలా కేవలం ఇద్దరు హీరోల సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం,ఇప్పుడు ముగ్గురు హీరోల సినిమాగా మారిపోయింది..డైరెక్టర్ బాబీ తన టేకింగ్ ఈ ముగ్గురు హీరోలను బాలన్స్ చేస్తూ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి..ఇందులో రవితేజ చిరంజీవి తమ్ముడిగా,ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు..అన్నయ్య చిత్రం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇదే.