Sri Reddy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మీటూ సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ దురదృష్టవశాత్తు దర్శకనిర్మాతలు ఆమెలో ఉన్నటువంటి బ్యూటీ యాంగిల్ మాత్రమే చూసి లోబర్చుకోవాలనుకున్నారు. దీంతో శ్రీరెడ్డి అవకాశాల పరంగా మోసపోయింది. తనలా మరెవరూ మోసపోకూడదని ఏకంగా క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి తెర లేపింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఒడిదుడుకుల ప్రయాణం..
మీటూ ఉద్యమం నేపథ్యంలో ఇండస్ట్రీ బిగ్‌షాట్స్ నుంచి శ్రీరెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. మీటూ ఉద్యమం పేరుతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరో ఫ్యామిలీని టార్గెట్ చేయడం, అలాగే ఆ హీరో తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలు కాస్త నటి శ్రీరెడ్డిని బహిష్కరించారు. అప్పటినుంచి నటి శ్రీరెడ్డి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో ఉంటూ కోలీవుడ్లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
సోషల్ మీడియాతో ఆదాయం..
ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని బాగానే క్యాష్ చేసుకుంటోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ అమ్మడికి డిజిటల్ మనీపై దృష్టి మళ్లీనట్లు తెలుస్తోంది. దీంతో తరచుగా వంటలు వీడియోలు, అలాగే బ్యూటీ టిప్స్ వంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. సోషల్ మీడియా ద్వారా నెలకి దాదాపుగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు సంపాదిస్తున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
వంటల వీడియోలో అందాల ఆరబోత..
శ్రీరెడ్డి వంటల వీడియోలలో కొత్త కొత్త వంటకాలను గురించి ప్రేక్షకులకు తెలియజేస్తోంది. సాధారణంగా వంట చేసినా, మామూలుగా బ్యూటీ టిప్స్ చెప్పినా ఎవరూ చూడరని భావించింది. ఇందు కోసం తెలుగు ఇండస్ట్రీ తనలో చూసిన బ్యూటీ ఆంగిల్‌నే పెట్టుబడి పెడుతోంది. వంట చేయడంలోనూ, బోల్డ్ బ్యూటీ టిప్స్ చెబుతున్న సందర్భంలోనూ అందాలు ఆరబోస్తోంది. దీంతో కుర్రకారు ఎగబడి శ్రీరెడ్డి వీడియోలు చూస్తున్నారు. ఈ అమ్మడు ఫేస్ బుక్ లో తన వంటలు వీడియో షేర్ చేసిందంటేచాలు కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు, వ్యూస్ వస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీకి మద్దతు…
శ్రీరెడ్డి ఒకపక్క సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును తెలియజేస్తోంది. వైకాపా పార్టీ నేతలపై ఎవరైనా విమర్శలు లేదా కామెంట్లు చేసినప్పుడు ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. దీంతో శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ సీపీ నేతల నుంచి కూడా డబ్బులు అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Recommend videos: