Sri Reddy On Bigg Boss 6 Telugu: బిగ్ బాస్.. దీని చుట్టూ ఎంత వివాదం ఉందో.. అంతే పాపులారిటీ కూడా ఉంది. బిగ్ బాస్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయే జనాలున్నారు. ఇప్పటికీ సినీ ప్రముఖులంతా ఈ షోను ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే దీన్ని వ్యతిరేకించే సంప్రదాయవాదులున్నారు. సీపీఐ నారాయణ లాంటి వారైతే ‘బిగ్ బాస్’ను బ్రోతల్ హౌస్ అనేశాడు. ఇప్పటికీ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు.
ఇక ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి బిగ్ బాస్ ను వ్యతిరేకిస్తోంది. తెలుగులో ఈమె చేసిన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఫేమస్ అయ్యింది. ఆ మధ్య ఫిలింనగర్ లో అర్ధనగ్న ప్రదర్శన చేసి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమెకు చెన్నైలో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది.
తాజాగా ఆమె తెలుగు బిగ్ బాస్ షో గురించి హాట్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళతారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘చస్తే బిగ్ బాస్ కు వెళ్లను’ అని స్పష్టం చేసింది. బిగ్ బాస్ కు వెళ్లి పరువు తీసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. నాలుగు రాళ్లు వెనకేసుకొని ఇల్లు కొనుక్కోగలరేమో కానీ.. పరువు క్యారెక్టర్ పోగొట్టుకొని బయట నిలబడిన ఎంతో మంది ఉన్నారని.. ఒకవేళ తనకు అవకాశం వచ్చినా తాను బిగ్ బాస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ అని.. నాగార్జున అసలు ఎలా ఒప్పుకొని ఈ షో చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. నాగార్జున మీసాలకు, జుట్టుకు రంగు వేసుకొని నాలుగు పూల చొక్కాలు వేసుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్లు రాసిచ్చిన ప్రశ్నలు అడిగితే సరిపోతుందా? అని ఘాటుగా ప్రశ్నించింది. ప్రస్తుతం నాగార్జునపై, బిగ్ బాస్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.