Sreemukhi: నీతోనే డాన్స్ షో కోసం శ్రీముఖి పాలా రోజా ఫ్రాక్ లో సిద్ధమైంది. శ్రీముఖి సాలిడ్ గ్లామర్ ఇంటర్నెట్ లో సునామీ సృష్టిస్తుంది. నీతోనే డాన్స్ సెలెబ్రిటీ డాన్స్ రియాలిటీ షో. ఈ షోకి సదా, తరుణ్ మాస్టర్, రాధ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో గ్రాండ్ ఫినాలే కోసం శ్రీముఖి మరింత గ్లామరస్ గా తయారైంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీముఖి యాంకరింగ్ లో దూసుకుపోతుంది. ఆమె ఐదారు షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. శ్రీముఖి యాంకర్ గా ఎదిగిన తీరు అద్భుతం. నటి కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీముఖి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. పటాస్ షోతో శ్రీముఖి ఫేమస్ అయ్యింది. యాంకర్ రవితో పాటు ఆ స్టాండప్ కామెడీ షోకి శ్రీముఖి ఆమె యాంకర్ గా వ్యవహరించింది. అనంతరం బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి తృటిలో టైటిల్ కోల్పోయింది. సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి ఫైనల్ కి వెళ్ళింది. రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి టైటిల్ కోసం పోటీపడ్డారు. అయితే రాహుల్ కే ప్రేక్షకులు టైటిల్ కట్టబెట్టారు. టైటిల్ చేజారినా శ్రీముఖికి పాపులారిటీ దక్కింది. ఆమె యాంకర్ గా ఎదిగేందుకు ఉపయోగపడింది. అలాగే భారీగా రెమ్యూనరేషన్ రాబట్టింది.
ప్రస్తుతం యాంకరింగ్ తో పాటు నటిగా కూడా రాణిస్తుంది. లేటెస్ట్ రిలీజ్ భోళా శంకర్ లో శ్రీముఖి కీలక రోల్ చేసింది. చిరంజీవితో పాటు కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె నటించారు. శ్రీముఖి హీరోయిన్ గా కూడా చేయడం విశేషం. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి మెయిన్ లీడ్ చేసింది. ఆ మూవీ అంతగా ఆడలేదు. ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆచితూచి ఎంచుకుంటుంది శ్రీముఖి. కొంచెం పేరున్న దర్శకులు, నిర్మాతలతో చిత్రాలు చేయాలని భావిస్తున్నారట.