Guntur Kaaram: గుంటూరు కారం మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుంది. దీంతో ప్రొమోషన్స్ షురూ చేశారు. ఫస్ట్ సింగిల్ ‘దమ్ మసాలా’ సాంగ్ ఆకట్టుకుంది. హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా ఉన్న లిరిక్స్ ఆకట్టుకున్నాయి. థమన్ స్వరాలు సైతం మెప్పించాయి. కాగా మరో సాంగ్ విడుదలకు రెడీ చేస్తున్నారు. ‘ఓహ్ మై బేబీ’ అనే సాంగ్ ప్రోమో డిసెంబర్ 11న సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదలకు చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు.
మహేష్ బాబు, శ్రీలీలతో కూడి ఉన్న పోస్టర్ పిచ్చ రొమాంటిక్ గా ఉంది. సదరు పోస్టర్ లో మహేష్ బుగ్గలపై శ్రీలీల ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఈ పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్-శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో అదిరిపోతుందని సదరు పోస్టర్ చెప్పకనే చెబుతుంది. చెప్పాలంటే ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు బలంగా ఉంటాయి. కాబట్టి గుంటూరు కారంలో శ్రీలీలకు మంచి పాత్ర దక్కి ఉంటుంది అనడంలో సందేహం లేదు. పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న నేపథ్యంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఆమె సెకండ్ హీరోయిన్. శ్రీలీల చేయాల్సిన పాత్ర మీనాక్షి చౌదరి చేస్తుంది.
ఇక గుంటూరు కారం 2024 జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఇది. దాదాపు 13 ఏళ్ల అనంతరం కలిసి చిత్రం చేస్తున్నారు. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు త్రివిక్రమ్ తెరకెక్కించారు. ఖలేజా 2010లో విడుదలైంది. దీంతో గుంటూరు కారం పై అంచనాలు భారీగా ఉన్నాయి. గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా రాదా? అనే సందేహాలు ఉండగా, చిత్ర యూనిట్ కచ్చితంగా వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.