నన్ను ఎంతో ప్రేమించావు.. చిరంజీవి చిన్న కుమార్తె ఎమోషనల్ పోస్ట్ !

     Sreeja Konidela Posts Emotional Message :  మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు నేడు.  మెగా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా వరుణ్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు.  ఇక ఫ్యాన్స్ తో పాటు  మెగా ఫ్యామిలీ నుంచి కూడా వరుణ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.   తాజాగా చిరంజీవి చిన్న కుమార్తె  శ్రీజ  కూడా  తన సోదరుడు వరుణ్ కి  పుట్టిన […]

Written By: Raghava Rao Gara, Updated On : January 19, 2022 6:45 pm
Follow us on

 

 

 Sreeja Konidela Posts Emotional Message :  మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు నేడు.  మెగా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా వరుణ్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు.  ఇక ఫ్యాన్స్ తో పాటు  మెగా ఫ్యామిలీ నుంచి కూడా వరుణ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.   తాజాగా చిరంజీవి చిన్న కుమార్తె  శ్రీజ  కూడా  తన సోదరుడు వరుణ్ కి  పుట్టిన రోజు  విషెస్‌ తెలియజేస్తూ   ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ ను షేర్ చేసింది. 

శ్రీజ మాటల్లోనే.. ‘తమ్ముడు వరుణ్ తేజ్..  నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.  కొందరు  పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను.  నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు.  అంతేకాదు,  నాకు నువ్వు ఫస్ట్ నుంచి ఎంతో గొప్పగా  సపోర్ట్‌ గా ఉన్నావు.   నన్ను  ఎంతో ప్రేమించావు.  నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది.  అందుకే, నువ్వు నాకెప్పుడూ  ప్రత్యేకమే’   అంటూ శ్రీజ మెసేజ్ చేసింది. 

 

పైగా తాను   వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లతో దిగిన ఫోటోని కూడా తన  ఇన్‌ స్టాలో పోస్ట్  చేసింది.  శ్రీజ పోస్ట్‌ చేసిన ఈ పోస్ట్  సోషల్‌ మీడియాలో బాగా  వైరల్‌ అవుతుంది.  ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గని, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నాడు.  దర్శకుడు అనిల్ రావిపూడికి  బాక్సాఫీస్  లెక్కలు బాగా తెలుసు.  ఆ లెక్కలకు అనుకూలంగానే  ‘ఎఫ్ 3‘ స్క్రిప్ట్ లో  వరుణ్ తేజ్ సీన్స్ లో  అదిరిపోయే కామెడీని యాడ్ చేశాడు. 

 

అయితే, ఈ కామెడీ..  వరుణ్  పాత్రలో  నుండి మాత్రమే  పుట్టుకొస్తోందట. ఇంతకీ సినిమాలో  నత్తితో నానాపాట్లు పడే  వ్యక్తి పాత్రలో వరుణ్‌  తేజ్ నటిస్తున్నారని  తెలుస్తోంది.  ఈ సినిమా  పూర్తిగా  డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు.  త‌మ‌న్నా, మెహ్రిన్ లు…  వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయని తెలుస్తోంది.   

https://www.instagram.com/p/CY5fRB1hJug/