Bigg Boss 9 Telugu Sreeja: అగ్నిపరీక్ష షో లో వేలమంది సామాన్యుల మధ్య ఒక కంటెస్టెంట్ గా ఎంపికై హౌస్(Bigg Boss 9 Telugu) లోకి అడుగుపెట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. షో లోకి అడుగుపెట్టడమే పెద్ద విజయం అనుకోవాలి. ట్రోఫీ ఆశించడం అత్యాశే అనుకుంట. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం ఓటింగ్ తో సంబంధం లేకుండా ఈ వారం ఇద్దరినీ ఎలిమినేట్ చేసింది. అందులో ఒకరు ఫ్లోరా షైనీ, మరొకరు శ్రీజ దమ్ము. ఫ్లోరా షైనీ ఎలిమినేషన్ ని అందరూ ఊహించిందే. ఆమె నుండి పెద్దగా కంటెంట్ రావడం లేదు, కచ్చితంగా ఎదో ఒకటి చేసి ఈమెని పంపిస్తారు అని అనుకున్నారు. అనుకున్నట్టే అయ్యింది. కానీ శ్రీజ ఎలిమినేషన్ ని మాత్రం ఎవ్వరూ అసలు ఊహించలేదు. ఆమె కచ్చితంగా టాప్ 5 వరకు వస్తుందనే అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్, డేంజర్ జోన్ లో ఉన్న రీతూ చౌదరి సేవ్ అయ్యింది, శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యింది.
అయితే ఈరోజు విడుదలైన ప్రోమోలను బట్టీ చూస్తే ‘పవర్ అస్త్రా’ అనే టాస్కు ని నిర్వహించారు. ఈ టాస్క్ లో గోల్డెన్ స్టార్స్ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. వీరిలో ఇమ్మానుయేల్ ఈ టాస్క్ ని గెలిచాడని, ఆయన చేతుల్లోకి పవర్ అస్త్రా వచ్చిందని, ఫ్లోరా ఎలిమినేట్ అయ్యాక రీతూ, శ్రీజ దమ్ము లలో ఎవరో ఒకరిని పవర్ అస్త్రా ఉపయోగించి సేవ్ చేసే అవకాశం ఇమ్మానుయేల్ కి నాగార్జున ఇచ్చాడని, అప్పుడు ఇమ్మానుయేల్ పవర్ అస్త్రా ని రీతూ ని సేవ్ చేయడానికి ఉపయోగించాడని టాక్ వినిపిస్తుంది. అదే కనుక నిజమైతే ఇమ్మానుయేల్ రేపటి నుండి సోషల్ మీడియా లో తీవ్రమైన నెగిటివిటీ ని ఎదురుకోవాల్సి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హౌస్ లో టాప్ 5 కి వెళ్లేంత సత్తా ఉన్న శ్రీజ దమ్ము, తనకు నెలకు రెండు లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి మరీ బిగ్ బాస్ షో కి వచ్చింది. కెరీర్ బాగుంటుందని అనుకుంది కానీ, మధ్యలోనే ఆమె జర్నీ ముగిసిపోయింది. ఆమె కోరుకున్న విధంగా సినీ రంగం లో అయినా, బుల్లితెర పై అయినా మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం.