Vishnu Vinyasam First Review: ఈ ఏడాది ఫిబ్రవరి నెల మన టాలీవుడ్ కి అసలు కలిసిరాలేదు. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ చిత్రానికి తప్ప , విడుదలైన అన్ని సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. సంక్రాంతికి థియేటర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడాయి , బహుశా జనాలు సినిమాలకు గత నెలలో ఎక్కువగా ఖర్చు చేయడం వల్లే , ఈ నెల బాక్స్ ఆఫీస్ బోసిపోయిందేమో అని విశ్లేషకులు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బయ్యర్స్ ఆశలు మొత్తం శ్రీ విష్ణు(Sree Vishnu) మీదనే పెట్టుకున్నారు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) ఈ నెల 27 న విడుదల కాబోతుంది. ముందుగా 28 న విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ , మొన్ననే ఒక రోజు ముందుకు విడుదల తేదీని షిఫ్ట్ చేశారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షోని నిన్న కొంతమంది బయ్యర్స్ , మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీకై బాగా వైరల్ అయ్యింది. శ్రీవిష్ణు నుండి యూత్ ఆడియన్స్ ఎలాంటి కామెడీ ని అయితే కోరుకుంటున్నారో , అలాంటి కామెడీ ని ఈ చిత్రం లో డైరెక్టర్ పొందుపరిచాడని , ఫస్ట్ హాఫ్ మొత్తం మీద రెండు మూడు సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వు రప్పించాయని , ఇంటర్వెల్ లో హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ కి హీరో కి మాత్రమే కాదు , ఆడియన్స్ కి కూడా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సీన్స్ కొన్ని రిపీట్ అయ్యినట్టుగా అనిపిస్తాయని , అది ఆడియన్స్ కి కాస్త చిరాకు కలిగించినా , చివరి 40 నిమిషాలు శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్ , ఎమోషన్స్ తో సినిమాని నిలబెట్టేశాడని అంటున్నారు.
ఓవరాల్ గా ఈ చిత్రం మంచి టైం పాస్ ఎంటర్టైనర్ గా నిలిచిందని , శ్రీవిష్ణు ని అభిమానించే వారికి ఈ చిత్రం తెగ నచ్చేస్తుందని అంటున్నారు . ఇక పోతే ఈ సినిమాకు శ్రీవిష్ణు మాత్రమే కాదు , నయన్ శారికా కూడా చాలా పెద్ద హైలైట్ అని తెలుస్తోంది. ఆమె నటన ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది అట. చూడాలి మరి ఆడియన్స్ నుండి కూడా ఇలాంటి రియాక్షన్ వస్తుందా లేదా అనేది. శ్రీ విష్ణు కి యూత్ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ఉండడం వల్ల , ఈ చిత్రం ప్రీ ఎలియాస్ బిజినెస్ తోనే నిర్మాత సేఫ్ అయ్యాడని టాక్ . మరి బయ్యర్స్ కూడా సేఫ్ అవుతారో లేదో తెలియాలంటే 27 వరకు ఆగాల్సిందే.