Sravanthi Chokkarapu: సినిమాల్లో ఛాన్స్ కొట్టడానికి యాంకరింగ్ మంచి వేదికగా భావిస్తారు. అందుకే యాంకర్ గా ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సినిమా హీరోయిన్లు అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు కాంపీటీషన్ విపరీతంగా ఉండడంతో వెండితెరపై అవకాశం రాకున్నా.. ఇతర షోలు, ఈవెంట్లలో చాన్స్ లు కొట్టి ఫేమస్ అవుతున్నారు. ఈ కోవలో ఫేమస్ అయ్యారు స్రవంతి చొక్కారపు. కొన్ని రోజుల కిందట ఈ భామ పేరు మారుమోగింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఈ బ్యూటీ ఫైనల్ వరకు వచ్చింది. కానీ టైటిల్ కొట్టలేకపోయింది. లేటేస్టుగా అమ్మడు డ్రెస్ చూసి షాక్ అవుతున్నారు. పెళ్లయి తల్లయినా హీరోయిన్ రేంజ్ లో లుక్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె గురించి తెగ చర్చలు పెడుతున్నారు.
స్రవంతి చొక్కారపు ముందుగా యూట్యూబ్ ఛానెళ్లలో పలు వీడియోలు చేసేంది. ఆ సమయంలో విపరీతమైన అభిమానులు సంపాదించుకున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడడం ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది. ఆ తరువాత యాంకర్ గా అడుగుపెట్టిన ఈ భామ ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’తో మరింత పాపులారిటీ సాధించుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ 5లో బిందు మాధవితో పోటీ పడింది. చివరి వరకు ఆమె కొనసాగడంతో ఒక దశలో టైటిల్ఈమెకే వస్తుందని అనుకున్నారు. కానీ మిస్సయింది.
అయాన స్రవంతి పాపులారిటీ దక్కలేదు. కొన్ని సినిమాల్లో సైడ్ పాత్రలు చేసి మెప్పిస్తోంది. యాక్టింగ్ లో తాను ఏ నటికి తగ్గలేదు అన్నట్లు తన ఫర్ఫామెన్స్ తో దూసుకుపోతుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో అడుగుపెట్టిన ఈ భామ హాట్ హాట్ గా కనిపిస్తూ యూత్ ను ఆకట్టుకుంది. హీరోయిన్ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇవ్వడంతో స్రవంతికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
టీవీ, సినిమాల్లో అవకాశాలు చేత బట్టుకుంటూనే సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతోంది ఈ భామ. గతంలో గోవా బీచ్ లో మతి పొగొట్టే అందాలతో పిచ్చెక్కింది. లేటేస్టుగా బ్లాక్ డ్రెస్ లో స్రవంతిని చూసి యూత్ పిచ్చోళ్లుగా మారుతున్నాయి. ఏం అందంరా బాబు అని కొందరు ఈమె ఫొటోలను చూసి కామెంట్స్ పెట్టడం విశేషం. అయితే స్రవంతి ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తరువాత వీరు పెళ్లిచేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించార. ప్రస్తుతం స్రవంతి దంపతులకు ఓ పాప. తల్లయినా స్రవంతి అందం ఏమాత్రం తగ్గడం లేదని కొందరు అనుకుంటున్నారు.