https://oktelugu.com/

శ్రావణి సూసైడ్ కేసులో ఓ నిర్మాత పేరు?

‘మనసు మమత’ , మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతోంది. శ్రావణి ఆత్మహత్య వ్యవహారంలో సాయికృష్ణ పేరు మొదట వినిపించింది. ఆ తర్వాత దేవరాజు రెడ్డి అన్నారు. Also Read: రవితేజ మీద పగ పట్టిన డైరెక్టర్ ! ఈ ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా దేవరాజు రెడ్డి, సాయికృష్ణ అనే ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. […]

Written By: , Updated On : September 10, 2020 / 02:58 PM IST
tv actor sravani

tv actor sravani

Follow us on

tv actor sravani
‘మనసు మమత’ , మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతోంది. శ్రావణి ఆత్మహత్య వ్యవహారంలో సాయికృష్ణ పేరు మొదట వినిపించింది. ఆ తర్వాత దేవరాజు రెడ్డి అన్నారు.

Also Read: రవితేజ మీద పగ పట్టిన డైరెక్టర్ !

ఈ ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా దేవరాజు రెడ్డి, సాయికృష్ణ అనే ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరితోపాటు RX-100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఆమె ఆత్మహత్యకు నిర్మాత అశోక్ రెడ్డి కారణమని తాజాగా దేవరాజ్ ఆరోపిస్తున్నాడు. తనను కాదని నిర్మాత అశోక్ రెడ్డితో శ్రావణి సన్నిహితంగా ఉండేదని.. ఆయన ఏటీఎంలు కూడా వాడేదని దేవరాజ్ ఆరోపించాడు.  నిర్మాత అశోక్ రెడ్డి కూడా శ్రావణిని పర్సనల్ గా చూసుకునేవాడని దేవరాజ్ ఆరోపించాడు.

సాయి అనే వ్యక్తియే కొట్టి హింసించేవాడని.. అతడి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని  శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి నిన్న చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 7న తాను, శ్రావణి కలిసి డిన్నర్ కు వెళ్లామని.. అక్కడ సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణిపై చేయి చేసుకున్నాడని దేవరాజ్ రెడ్డి వివరించారు. శ్రావణికి ఐదేళ్లుగా సాయితో పరిచయం ఉందని.. తాను సంవత్సరం క్రితం శ్రావణికి స్నేహితుడను అయ్యానని దేవరాజ్ రెడ్డి తెలిపారు. సాయి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించాడు.

Also Read: పాపం నిర్మాతలు.. తగ్గనంటున్న క్రియేటివ్ డైరెక్టర్ !

తాజాగా సాయి అనే వ్యక్తి బయటకు వచ్చి సంచలన విషయాలు బయటపెట్టాడు. దేవరాజు రెడ్డి విడుదల చేసిన ఈ వీడియో అవాస్తవమని సాయి కొట్టిపారేశాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి స్నేహితుడని.. శ్రావణి చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని తెలిపాడు. తాను ఎక్కడికి పారిపోలేదని.. పోలీసులతోనే ఉన్నానని సాయి వెల్లడించాడు.

అయితే ఈ వివాదంలోకి వచ్చిన టాలీవుడ్ నిర్మాత అశోక్ రెడ్డి దీనిపై ఇంతవరకు స్పందించలేదు. కాగా చనిపోయిన శ్రావణి అంత్యక్రియలు ఆమె కుటుంబ సభ్యుల చేతుల మీదుగా రాజమండ్రిలో ముగిశాయి.