Tamannaah: హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. గ్లామర్ ఉన్నంత కాలమే కెరీర్ ఉంటుంది. దాని కోసం హీరోయిన్స్ అష్టకష్టాలు పడతారు. యోగాలు, వ్యాయామాలు చేస్తారు. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా వీటితో పాటు ఓ స్పెషల్ చిట్కా పాటిస్తున్నారు. తెల్లని పాలరాతి బొమ్మలా ఉండే ఈ చిన్నది ప్రతి రోజూ ఉదయాన్నే ముఖానికి తన ఉమ్మి రాసుకుంటారట. అది ఆమె గ్లామర్ ని రెట్టింపు చేస్తుందట. ఉమ్మితో చర్మం మెరిసిపోతుందట. అందుకే ఈ విధానం ప్రతిరోజూ ఆమె క్రమం తప్పకుండా పాటిస్తారట.

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తమన్నా స్వయంగా చెప్పారు. లాలాజలంలో చర్మాన్ని మెరిపించే, ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయట. శాస్త్రీయంగా ఇది నిరూపితమైందట. ఎక్కడో దీని గురించి తెలుసుకున్న తమన్నా చాలా కాలంగా పాటిస్తున్నారట. మరి 30 ఏళ్ళు పైబడినా కూడా మెరిసిపోతున్న తమన్నా గ్లామర్ సీక్రెట్ ఇదే కాబోలు. అయితే ఈ అలవాటు కొంచెం డర్టీగా ఉంది. తమన్నా స్టేట్మెంట్ విన్నాక ఆమెను ముద్దాడిన హీరోలు ఇబ్బందిగా ఫీల్ కావడం ఖాయం.
కాగా అందం, ఫిట్నెస్ విషయంలో తమన్నా చాలా సీరియస్ గా ఉంటారు. ఆమె ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆ మధ్య తమన్నా కోవిడ్ బారిన పడ్డారు. కరోనా చికిత్స తర్వాత ఆమె బరువు పెరిగారు. లావైన తమన్నాను చూసి కొందరు ఎగతాళి చేశారు. తమన్నా సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యారు. సదరు విమర్శలపై తమన్నా మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో బరువు పెరిగితే బాడీ షేమింగ్ కి పాల్పడతారా అంటూ సీరియస్ అయ్యారు. పట్టుదలతో బరువు తగ్గి తానేమిటో నిరూపించుకున్నారు.

గ్లామర్ పట్ల అంత శ్రద్ధ ఉండబట్టే తమన్నా పదిహేనేళ్లుగా స్టార్ హోదాలో ఉన్నారు. ఇప్పటికీ ఆమె క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. చిరంజీవికి జంటగా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు తమన్నా. అలాగే యంగ్ హీరో సత్య దేవ్ తో గుర్తుందా శీతాకాలం మూవీలో నటిస్తున్నారు. ఆమె బాలీవుడ్ మూవీ బబ్లీ బౌన్సర్ ఈ నెల 23న విడుదల కానుంది. మరో రెండు హిందీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ తరం హీరోయిన్స్ లో కాజల్, తమన్నా లాగ్ కెరీర్ కలిగివున్నారు.