Prabhas Spirit Movie: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం అయిన ఫౌజీ (Fouji) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ సినిమా చేయడానికి ఆయన భారీగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్న ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఏది ఏమైనా కూడా ఇండియాలో ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఎవ్వరికి దక్కని సక్సెస్ లు ప్రభాస్ కి దక్కాయి. అందువల్లే ఆయన ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదగడమే కాకుండా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటున్నాడు… ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో కనిపించబోన్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
Also Read: హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్ కు ఏ రకంగా ఉపయోగపడనుంది…
మరి ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ సందీప్ రెడ్డివంగా మాత్రం ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ ని బయటికి చెప్పడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈ సినిమా న్యూస్ మొత్తాన్ని చాలా రహస్యంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో మేజిక్ ని క్రియేట్ చేసిన సందీప్ ఆ తర్వాత ఆనిమల్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. సందీప్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఆ సినిమా మీద చాలా వరకు అంచనాలైతే పెరిగిపోయాయి.
Also Read: రామాయణం తీయబోతున్న మంచు ఫ్యామిలీ..ఈసారి బడ్జెట్ ఎంతంటే!
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే స్పిరిట్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లడంలో అటు ప్రభాస్ ఇటు సందీప్ రెడ్డి వంగ ఇద్దరు చాలా వరకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.