Spirit movie controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) లాంటి దర్శకుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన అనిమల్ (Animal) సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా పుల్రువ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో ఆయన పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ (Prabhas) ను చాలా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ ఇకమీదట చేయాబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ చేస్తున్న సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేస్తున్నాడు అంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. నిజానికి బాలీవుడ్ మాఫియా కి పోటీని ఇస్తూ వాళ్లను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ మీడియా సైతం సందీప్ రెడ్డివంగా హాలీవుడ్ సినిమాలను కాపీ చేసి స్పిరిట్ సినిమా చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలను స్ప్రెడ్ చేస్తుంది. మరి ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ మాత్రం ఈ విషయాల మీద ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఇక బాలీవుడ్ మీడియా ఎప్పటికప్పుడు సందీప్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే.
దీపిక పదుకొనే (Deepika Padukone) విషయంలో మొన్నటిదాకా వార్తల్లో నిలిచిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడిప్పుడే ఆ విషయాం నుంచి డైవర్ట్ అవుతున్నాడు. ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని చాలామంది అతని సన్నిహితులు తనకు చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ సినిమాలను ఎంత రా గా తెరకెక్కిస్తాడో తన పర్సనల్ విషయాల గురించి ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్లకు అలాగే గట్టి కౌంటర్ అయితే ఇస్తూ ఉంటాడు. స్పిరిట్ నిజంగానే ఏదైనా హాలీవుడ్ సినిమాకి కాపీ గా వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…