Spirit: సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అది రికార్డులు బ్రేక్ చేస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఈ సినిమాను వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సందీప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ దెబ్బలు తగిలి కట్లతో ఉండగా త్రిప్తి డిమ్రి ప్రభాస్ కి సిగరెట్ ను వెలిగిస్తుంటే ఒక సైడ్ నుంచి ప్రభాస్ కనిపిస్తుంది. ఈ పోస్టర్ తో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సందీప్ రెడ్డివంగ ఇక మీదట కూడా హైప్ ఇచ్చే ప్రమోషన్ చేసి సినిమాని నెక్స్ట్ లెవల్లో నిలుపుతాడంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే కొంతమంది ఈ సినిమా ప్రభాస్ కి కాకుండా మహేష్ బాబు కి గాని, జూనియర్ ఎన్టీఆర్ గానీ పడుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేదని ప్రభాస్ ఫేస్ ప్లేస్ లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ లను పెట్టి మార్ఫింగ్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఇక ఇది మహేష్, ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న పబ్లిసిటీ అయినప్పటికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కంటే ఈ సినిమాకి బాగా సెట్ అయింది అని ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసి మనం సినిమాని క్యాలిక్లెట్ చేయలేము…
సినిమాలో ప్రభాస్ రేంజ్ ని చూపించగలిగే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అందువల్లే ఈ సినిమా కోసం ప్రభాస్ ని ఎంపిక చేసుకున్నానని సందీప్ గతంలో క్లారిటీ ఇచ్చాడు. ఇక దానికి కట్టుబడి ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇది చూసిన ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కంటే ప్రభాస్ కి బాగా సెట్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డుల వేట ఏ రేంజ్ లో ఉంటుందో చూసుకోండి అంటూ ఇతర హీరోల అభిమానులకు సవాళ్లను విసురుతున్నారు…