Spirit Glimpse: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ తో రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డివంగ వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేయడమే ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం సందర్భంగా స్పిరిట్ సినిమానుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఈరోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు. మార్చి 5, 2027 వ సంవత్సరంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు…
ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ ను తన కథలో వేసుకోవాలనే ఉద్దేశ్యంతో సందీప్ వంగ ఉన్నాడు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన సందీప్ మరికొద్ది రోజుల్లో సినిమా గ్లింప్స్, టీజర్స్ ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
అయితే గ్లింప్స్, టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగకి మెగాస్టార్ చిరంజీవికి మధ్య మంచి బాండింగ్ ఉంది. సందీప్ డైరెక్టర్ గా మారడానికి చిరంజీవి ముఖ్య కారణమని ఆయన సినిమాలు చూస్తూనే పెరిగానని ఆయన గతం లో చాలా సార్లు చెప్పాడు.
ఇక స్పిరిట్ సినిమా టీజర్ ని తన అభిమాన హీరో అయిన చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తే బాగుంటుందని చిరంజీవి అభిమానులు, సందీప్ రెడ్డి వంగ సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ప్రభాస్ – చిరంజీవి మధ్య కూడా చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో చిరంజీవి ఫేవరెట్ హీరో ప్రభాస్ కావడం విశేషం… ఇక ప్రభాస్ సైతం నా అభిమాన హీరో చిరంజీవి అంటూ పలు సందర్భాల్లో తనే స్వయంగా చెప్పాడు.