Devara Fight: సినిమా ఇండస్ట్రీలో స్టార్ రేంజ్ రావాలంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడాలి. తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అదే విధంగా జూ. ఎన్టీఆర్ ఎంతో కష్టపడి స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి తన రేంజ్ ను పాన్ వరల్డ్ రేంజ్ లో పరీక్షించుకున్నాడు. అయితే వచ్చిన పేరును పదిలం చేసుకోవడం కూడా కష్టమే. ఇక ఇదే పనిలో పడ్డారు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం దేవర సినిమాతో తన రేంజ్ ను మరోసారి పరీక్షించుకునే పనిలో పడ్డారు. దీని కోసం ఎంతో కష్టపడుతున్నారు.
దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో ఎంతో మంది స్టార్లు నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఒక్క అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారట. ఒక్క ఫైట్ కోసం చాలా ఖర్చు చేస్తున్నారని తెలియగానే అంచనాలు మరింత పెరిగాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ ఎదురుచూస్తున్నారు. అందరూ ఎదురుచూస్తున్నట్టు ఈ ఒక్క ఫైటే సినిమా మొత్తానికి ఇంపాక్ట్ అవబోతుందట.
దేవర సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. మొదటి పార్ట్ ఈ సంవత్సరం రిలీజ్ అయితే సెకండ్ పార్ట్ వచ్చే సంవత్సరం రిలీజ్ అవబోతుందని టాక్. మొత్తం మీద జూ. ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ను అందుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గనుక సక్సెస్ అయితే వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ లను అందుకున్న హీరోగా గుర్తింపు పొందుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఏ హీరో కూడా వరుసగా 7 సినిమాలను విజయం సాధించి.. సక్సెస్ ను అందుకోలేదు. మరి చూడాలి ఈ అదృష్టం ఎన్టీఆర్ ను వర్తింస్తుందో లేదో…