Guntur Kaaram Beedi
Guntur Kaaram Beedi: గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ హైలెట్ గా నిలిచింది. కథ కథనాలు నిరాశపరిచిన మహేష్ ని చూపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బీడీ తాగుతూ ఊరమాస్ రోల్ లో మహేష్ మెస్మరైజ్ చేశాడు. కాగా మహేష్ దాదాపు ప్రతి సీన్ లో బీడీ తాగాడు. మహేష్ తాగింది నిజమైన బీడీనా? కాదా? అనే సందేహాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. దీనిపై మహేష్ బాబు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.
మహేష్ మాట్లాడుతూ… ”నాకు స్మోకింగ్ అలవాటు లేదు. దాన్ని నేను ఎంకరేజ్ కూడా చేయను. షూటింగ్ లో మొదటిరోజు బీడీ తాగాను. నాకు తలనొప్పి వచ్చింది. అది రోజంతా బాధించింది. ఈ విషయం త్రివిక్రమ్ కి చెప్పాను. అప్పుడు ఆయుర్వేదిక్ బీడీ ఏర్పాటు చేశారు. అందులో పొగాకు ఉండదు. లవంగాలు వంటి సుగంధాలతో తయారు చేసింది. మింట్ ఫ్లేవర్ తో అది చాలా బాగుండేది. అలా బీడీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాము”, అన్నారు.
కాబట్టి ఫ్యాన్స్ మహేష్ బీడీ తాగాడని తాము తాగాలని స్ఫూర్తి పొందితే పొరపాటే అన్నమాట. అసలు మహేష్ కి స్మోకింగ్ హ్యాబిట్ కూడా లేదట. మరొకరు తాగడాన్ని ఆయన ఎంకరేజ్ చేయరట. స్టార్ హీరోలు స్మోక్ చేయడం వలన అభిమానులు ఈ అలవాటు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు పూర్తి క్లారిటీ ఇచ్చాడు. గుంటూరు కారంలో తల్లి ప్రేమకు నోచుకోని కొడుకుగా మహేష్ నటించాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ కి జంటగా శ్రీలీల నటించింది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరామ్ కీలక రోల్స్ చేశారు. టాక్ తో సంబంధం లేకుండా గుంటూరు కారం చెప్పుకోదగ్గ వ్ వసూళ్లు రాబట్టింది.
Web Title: Special beedi for guntur kaaram mahesh revealed the secret
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com