HBD Prabhas: జీరో నుంచి మొదలై ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ కి మొగుడుగా మారిన ప్రభాస్ ప్రస్థానం…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ధృవ తారా గా ఎదుగుతున్న నటుడు ప్రభాస్... ప్రస్తుతం ఇండియాలోనే ఆయనను మించి స్టార్ డమ్ ను సాధించిన హీరో మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...సలార్, కల్కి సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న హీరో కూడా ప్రభాస్ గారే కావడం విశేషం...

Written By: Gopi, Updated On : October 23, 2024 9:11 am

HBD Prabhas

Follow us on

HBD Prabhas: కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్… తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈశ్వర్ సినిమాతో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన హీరోగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. నిజానికి ఆయనలాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఒక ఎత్తైతే ఇకమీదట ఆయన క్రియేట్ చేయబోయే రికార్డులు మరొక ఎత్తనే చెప్పాలి. పాన్ ఇండియాలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలు చేస్తూ 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ చేస్తున్న హీరో ప్రభాస్… ప్రస్తుతం తను చాలా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒక్కో సినిమాని ఫినిష్ చేస్తూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఆరడుగుల హైట్ తో, చూడగానే హీరో అనిపించే కటౌట్ తో ఇండియన్ ప్రేక్షకులే కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా మందిని తన అభిమానులుగా మార్చుకున్న హీరో కూడా ప్రభాస్ గారే కావడం విశేషం…ఇక ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటూ అతనికి విషెస్ చెబుతున్నారు. నిజానికైతే ప్రభాస్ స్థానంలో మరొక హీరో ఉంటే చాలా గర్వాన్ని చూపిస్తూ ఉండేవారు. కానీ ప్రభాస్ మాత్రం చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ లానే ఉంటాడు. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగిన కూడా ఒదిగే ఉంటాడు. మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా కూడా ఆయన ఎక్కడ ఢీలా పడలేదు. వర్షం సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న ప్రభాస్ తన సక్సెస్ ల పరంపరంను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇక బాహుబలి సినిమాతో రాజమౌళితో జత కట్టిన ఈయన ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో కీలక పాత్ర వహించారు.

ఇక అప్పటినుంచి పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం డామినేట్ చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు ఇండస్ట్రీ ని నెంబర్ వన్ పొజిషన్ లో నిలిపాడు. మేమే తోపులం అని ఫీల్ అయిపోయే బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ కు చెక్ పెట్టడం విశేషం…వరుసగా తన సినిమాలతో అక్కడ ఉన్న హీరోలందరి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. ఇక అలాంటి డార్లింగ్ ను వేరే హీరోల అభిమానులు కూడా ఇష్టపడుతుంటారు.

ముఖ్యంగా అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్న నేపధ్యం లో కూడా ప్రభాస్ మీద ప్రతి ఒక్క అభిమాని తమ ఇష్టాన్ని చూపిస్తారు. నిజానికి ఆయన సినిమాలను ప్రతి ఒక్క ఆడియన్ కూడా చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా మొదటి రోజే ఆయన సినిమాను చూడడానికి ఎక్కువ మంది యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు… ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా బోల్డ్ కంటెంట్ తో వస్తున్నప్పటికీ ప్రభాస్ మాత్రం పాన్ ఇండియాలో తన సత్తాని చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది… మొత్తానికైతే ఇక మీదట కూడా ప్రభాస్ మరిన్ని భారీ విజయాలను సాధించాలని కోరుకుందాం…