Homeఎంటర్టైన్మెంట్Cannes 2022: 'కాన్స్' లోనూ నార్త్ భామలతో పోటీ పడుతున్న సౌత్ భామలు

Cannes 2022: ‘కాన్స్’ లోనూ నార్త్ భామలతో పోటీ పడుతున్న సౌత్ భామలు

Cannes 2022: ప్రతిష్టాత్మక ‘కాన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్’ ఈ సారి ఫ్రాన్స్ లో అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఐతే, ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. కరోనా వల్ల చాలా లాంగ్ గ్యాప్ తర్వాత, ఈ చిత్రోత్సవం ఘనంగా మొదలైంది. పైగా ఈ చిత్రోత్సవం కోసం పలువురు భారతీయ నటీనటులు కూడా ఫ్రాన్స్ కి తరలి వెళ్లారు. దాంతో అక్కడంతా తారల తళుకుబెళుకులతో కళకళలాడి పోతుంది.

Cannes 2022
Pooja Hegde

ఇన్నాళ్లు కాన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్ కి ఎక్కువగా బాలీవుడ్ తారలే వెళ్లేవారు. కానీ, మాకేం తక్కువ అంటూ సౌత్ భామలు కూడా అక్కడకు వెళ్లి, తమ మెరుపులు మెరిపిస్తున్నారు. ఇప్పటికే, మిల్కీ బ్యూటీ తమన్నా ఆల్రెడీ కాన్స్ కోసం ఫ్రాన్స్ లో అడుగు పెట్టింది. ఈ ముదురు గుమ్మకు ఎలాగూ ఇక్కడ షూటింగ్ లు లేవు. అందుకే, తన ఖాళీ టైమ్ ను ఇలా ప్లాన్ చేసుకుంది.

Also Read: Bigg Boss Non Stop Anchor Shiva: బిగ్ బాస్ నాన్ స్టాప్: ఎలాంటి అంచనాల్లేకుండా టాప్ 3గా యాంకర్ శివ ఎలా ఎదిగాడు?

ఇంతకీ తమన్నా అక్కడ ఏమి చేస్తోందో తెలుసా ? రెడ్ కార్పెట్ పై గ్రాండ్ గా క్యాట్ వాక్ చేయబోతోంది. ఈ మేరకు తమన్నా ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. మరో కేజీ హీరోయిన్ పూజా హెగ్డే కూడా కాన్స్ కోసం షూటింగ్ కి డుమ్మా కొట్టింది. ఇప్పటికే, పూజా కూడా కాన్స్ ప్రాంగణానికి చేరుకుంది. అలాగే, కాన్స్ కోసం పూజా హెగ్డే కాస్ట్ లీ డిజైనర్ డ్రెస్ లో అందాల వెలుగులతో మెరవబోతుంది. ‘కాన్స్’ లోనూ నార్త్ భామలతో సౌత్ భామలు గట్టిగానే పోటీ పడుతున్నారు.

Cannes 2022
Tamannaah Bhatia

అలాగే, విశ్వ నటుడు కమల్ హాసన్, తన కొత్త సినిమా ‘విక్రమ్’ ట్రైలర్ ను కాన్స్ లో ఘనంగా లాంచ్ చేయనున్నారు. ఇక ప్రతి ఏటా కాన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కూడా, కాన్స్ లో ప్రత్యేక అట్రాక్షన్ గా నిలవబోతుంది. ఇప్పటికే తన కూతురు, భర్తతో కలిసి ఐశ్వర్యరాయ్ కాన్స్ కు చేరుకుంది.

Cannes 2022
Deepika Padukone

కాన్స్ లో ఇండియా నుంచి మరో స్పెషల్ ఉంది. దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లాంటి ముద్దుగుమ్మలు కూడా కాన్స్ లో హడావుడి చేయబోతున్నారు. పైగా దీపికా పదుకొణె, జ్యూరీ సభ్యురాలిగా కాన్స్ లో అడుగుపెట్టింది. అందుకే, కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం, దీపికా పదుకొణె డిఫరెంట్ డ్రెస్సెస్ ను ప్లాన్ చేసుకుంది. బుధవారం సాయంత్రం జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో దీపికా కాన్స్ స్టేజి పై ధగధగ మెరిసిపోతూ కనిపించింది. ఇంకా కాన్స్ లో ఎన్ని మెరుపులు మెరుస్తాయో చూడాలి.

Also Read:Sarkaru Vaari Paata: ‘సర్కారు’ కలెక్షన్స్.. గొప్పలు & తిప్పలతో పాటు పూర్తి లెక్కలివే !

Recommended Videos

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular