Homeఎంటర్టైన్మెంట్Dasara Special Trains: దసరాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్, రూట్లు ఖరారు..

Dasara Special Trains: దసరాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్, రూట్లు ఖరారు..

Dasara Special Trains: తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరా. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుకలకు చాలా మంది సొంత ఊళ్లకు వెళ్తారు. దసరా సెలవులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అక్టోబర్‌ 6 నుంచి కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. మరోవైపు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభమయ్యాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలయ్యాయి. దీంతో చాలా మంది పిల్లా పాపలతో సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు వివిధ రూట్లలో 644 ప్రత్యేక సర్వీస్‌లు నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 15 వరకు ఈ రైల్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడు, మహబూబ్‌నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ప్రత్యేక రైళ్లు ఇలా..
దసరా పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 170 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా మరో 115 రైళ్లు నడపనుంది. మరో 185 రైళ్లు సాసింగ్‌ త్రూ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈమేరు ప్రత్యేక రైళ్ల రూట్లను కూడా ప్రకటించారు. సికింద్రాబాద్‌–కాకినాడ, కాచిగూడ–తిరుపతి, కాచిగూడ–నాగర్‌సోల్, సికింద్రాబాద్‌–మద్లాటౌన్, సికింద్రాబాద్‌–సుబేదార్‌గంజ్, హైదరాబాద్‌–గోరఖ్‌పూర్, మహబూబ్‌నగర్‌–గోరఖ్‌పూర్, సికింద్రాబాద్‌–దానాపూర్, సికింద్రాబాద్‌–రక్సాల్, సికింద్రాబాద్‌–అగర్తలా, సికింద్రాబాద్‌–నిజాముద్దీన్, సికింద్రాబాద్‌–రెర్హంపూర్, సికింద్రాబాద్‌–విశాఖపట్టణం మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్‌–సంత్రగచ్చి, తిరుపతి–మచిలీపట్నం, తిరుపతి–అకోలా, తిరుపతి–పూర్ణ, తిరుపతి–హిసర్, నాందేడ్‌–ఎరోడ్, జల్నా–చప్రా, తిరుపతి–షిర్డీ తదితర ముఖ్యమైన రూట్లలోనూ ప్రత్యేక రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

కిటకిటలాడుతున్న రైల్వే స్టేసన్లు..
వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బారీగా ప్రయాణికులు రైళ్లలో సొంత ఊళ్లకు వెళ్లేందుకు వస్తున్నారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. వివిధ రూట్లలో నడిచే 20 రెగ్యులర్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పది రోజుల క్రితం రద్దు చేసింది. పండుగ వేళ రైళ్ల రద్దుపై విమర్శలు రావడంతో ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసింది.
రద్దీకి అనుగుణందగా ప్రత్యేక రైళ్లకు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular