https://oktelugu.com/

soundarya: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జూనియర్ సౌందర్య ఫోటోలు… ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

soundarya: తెలుగు సినిమా పరిశ్రమలో సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పేరుకి కన్నడ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగులో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన తర్వాత సౌందర్య అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అప్పట్లో స్టార్ హీరోల అందరికీ ఈమె ఒక ఆప్షన్ గా ఉండేది. ఇలా చిత్ర పరిశ్రమలో అతి తక్కువ వయసులోనే ఎంతో గొప్ప స్థానానికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 2, 2021 / 06:32 PM IST
    Follow us on

    soundarya: తెలుగు సినిమా పరిశ్రమలో సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పేరుకి కన్నడ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగులో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన తర్వాత సౌందర్య అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అప్పట్లో స్టార్ హీరోల అందరికీ ఈమె ఒక ఆప్షన్ గా ఉండేది. ఇలా చిత్ర పరిశ్రమలో అతి తక్కువ వయసులోనే ఎంతో గొప్ప స్థానానికి ఎదిగిన సౌందర్య అకాల మృతినీ ఇప్పటికీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

    ఇప్పటికీ సౌందర్య సినిమాలు టీవీలలో ప్రసారం అయితే ఆమె మరణాన్ని తలచుకుని బాధ పడతారు. 2004వ సంవత్సరంలో రాజకీయా ప్రచారంలో భాగంగా విమాన ప్రమాదంలో సౌందర్య అతని సోదరుడు మృతి చెందారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి తర్వాత అంతటి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న సౌందర్య ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా అచ్చం సౌందర్య పోలికలతో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     

    ఈమె ముఖకవళికలతో పాటు రూపురేఖలు కూడా సౌందర్యని పోలి ఉండటంతో అభిమానులు ఈమెను చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఈమెను చూస్తుంటే సౌందర్య మళ్లీ పుట్టిందా… అనే అనుమానాలు కలగక మానదు. అచ్చం సౌందర్య పోలికలతో ఉన్న ఈ అమ్మాయి పేరు చిత్ర. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఈమె ఫోటోలు వీడియోలు చూస్తున్న నెటిజన్లకు మరొకసారి సౌందర్య గుర్తుకు వస్తోంది. అచ్చం అదే పోలికలతో ఉన్నటువంటి ఈమెకు సినిమా అవకాశాలు వస్తే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా లేదా అంటూ ఆరా తీస్తున్నారు.