Rashmi Gautam: సుమారు పదేళ్ల నుండి ఈటీవీ లో విరామం లేకుండా కొనసాగుతున్న ఎంటర్టైన్మెంట్ కామెడీ షో జబర్దస్త్ షో కి మొదటి నుండి ఆయువుపట్టులాగా నిలిచిన ఎంతోమంది ఈ షో ని వదిలి వెళ్లిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా మరియు యాంకర్ అనసూయ, కమెడియన్స్ సుడిగాలి సుధీర్, చలాకి చంటి , చమ్మక్ చంద్ర ఇలా ఎందరో ఈ షో ని వదిలి వెళ్లిపోయారు..మధ్యలో హైపర్ ఆది మరియు గెటప్ శ్రీను వంటి వారు కూడా ఈ షో ని వదిలి వెళ్లిపోయాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చారు.

ఇలా షో ప్రారంభం నుండి ఆయువుపట్టులాగా నిలిచిన వీళ్ళందరూ ఒక్కొక్కరిగా వెళ్లిపోవడం షోకి ఉన్న కళ తప్పింది..ఇప్పుడు లేటెస్ట్ గా యాంకర్ రష్మీ కూడా ఈ షో కి గుడ్ బై చెప్పేసింది తెలుస్తుంది..ప్రతి గురువారం ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం కి యాంకర్ గా రష్మీ కొనసాగుతూనే వస్తుంది.
జబర్దస్త్ లో ఎన్ని మారిన యాంకర్ రష్మీ మాత్రం మారలేదు..ఈ పదేళ్లలో ఒక్క ఎపిసోడ్ కి కూడా ఆమె డుమ్మా కొట్టింది లేదు..అలాంటి రష్మీ ఇప్పుడు ఈ షో ని వదిలేయడం చర్చనీయాంశంగా మారింది..వచ్చే గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో రష్మీ కి బదులుగా ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ సౌమ్య రావు దర్శనమించింది..ఇక నుండి కూడా ఆమెనే కొనసాగబోతున్నట్టు తెలుస్తుంది..అయితే రష్మీ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ విడుదల సందర్భంగా ఆమె ప్రొమోషన్స్ లో బిజీ గా ఉండడం వల్లే జబర్దస్త్ షో కి డుమ్మా కొట్టిందని కూడా కొంతమంది అంటున్నారు..దీని పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఆమె హీరోయిన్ గా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పూర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది..రష్మీ ఉండడం వల్ల ఓపెనింగ్స్ కాస్త పర్వాలేదు అనే రేంజ్ అనిపించినా..ఫుల్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాణించే సినిమా మాత్రం కాదని రివ్యూస్ వచ్చాయి.