Jabardasth anchor Soumya Rao
Soumya Rao : తొమ్మిదేళ్లకు పైగా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న అనసూయ 2022లో తప్పుకుంది. ఇతర షూటింగ్స్ లో బిజీ కావడం వలన డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని అనసూయ అన్నారు. అయితే ఆమె నిష్క్రమణకు అనేక కారణాలు ఉన్నాయని అనంతరం తెలిసింది. ఆమె ప్లేస్ లో ఎవరు వస్తారనే ఆసక్తి నెలకొంది. జబర్దస్త్ అత్యంత పాప్యులర్ షో కాగా, స్టార్ యాంకర్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. చాలా మంది అనసూయ పొజిషన్ కోసం పోటీపడ్డారు. అనూహ్యంగా కన్నడ సీరియల్ నటి సౌమ్యరావుకు ఆ ఛాన్స్ దక్కింది.
సౌమ్యరావుకు తెలుగు రాదు. గ్లామర్ లో అనసూయకు ఏ మాత్రం పోటీ కాదు. ఈ క్రమంలో సౌమ్యరావుకు జబర్దస్త్ షో ఒక ఛాలెంజ్ లా మారింది. హైపర్ ఆది ఒక రేంజ్ లో సౌమ్యరావును ఆడుకునేవాడు. తెలుగు పూర్తిగా రాకపోవడంతో సౌమ్యరావుకు కొన్ని పంచులు అర్థం అయ్యేవి కాదు. అనసూయ మాదిరి ఆమె కౌంటర్లు కూడా ఇవ్వలేకపోయేది. అయినప్పటికీ కొన్నాళ్ళు పైగా సౌమ్యరావు జబర్దస్త్ షోలో ఉన్నారు.
సడన్ గా షోలో ఆమె కనిపించలేదు. దాంతో హైపర్ ఆది తనను ఇబ్బందులకు గురి చేశాడు. అందుకే షో నుండి తప్పుకుందని పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ పుకార్లకు తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. హైపర్ ఆది వలన తాను జబర్దస్త్ మానేశానన్న వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. తనపై వేసే జోక్స్ కామెడీలో భాగమే. హైపర్ ఆది బాగా ప్రోత్సహించాడు. అక్కడ ఎవరు ఎవరిని తొక్కేయాలని చూడరు. అందరు కింది స్థాయి నుండి వచ్చినవాళ్లే అని సౌమ్యరావు అన్నారు.
జబర్దస్త్ నుండి మల్లెమాల సంస్థ తనను తప్పించినట్లు పరోక్షంగా సౌమ్యరావు చెప్పారు. ఆమె ఒక చిన్న కథతో ఈ విషయం వెల్లడించారు. కష్టపడి ఒక వ్యక్తి సైకిల్ కొనుక్కుంది. అనంతరం చిన్న మారుతి కారు కొని, అందులో తిరిగే స్థాయికి వెళ్ళింది. సడన్ గా బెంజ్ కారు తీసుకొచ్చి, నువ్వు నడపాల్సిన కారు ఇది అని, అందులో ఎక్కించారు. కొంత దూరం ప్రయాణం చేశాక, దించేశారు. బెంజ్ కారులో ప్రయాణం చేసినందుకు సంతోషించాలా… ఉన్న కారుకు కూడా దూరంగా వదిలేశారని బాధ పడాలా… అని సౌమ్యరావు అన్నారు. అంటే జబర్దస్త్ రూపంలో బంపర్ ఆఫర్ ఇచ్చి, సడన్ గా తొలగించడం ద్వారా రోడ్డున పడేశారని ఇండైరెక్ట్ గా సౌమ్యరావు చెప్పారు.