https://oktelugu.com/

Tollywood: తగ్గేదే లే అంటున్న అల్లు ఫ్యామిలి… పోటీకి సై అంటున్న తండ్రి, కొడుకు

Tollywood: విభిన్నమైన పాత్రలతో వినోదాన్ని పంచడంలో డైరెక్టర్ మారుతి కి ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి‌. ఇటీవలే మారుతి దర్శకత్వంలో విడుదలైన “మంచిరోజులు వచ్చాయి”ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మారుతి దర్శకత్వంలో హీరో గోపీచంద్, రాశి కన్నా జంటగా నటిస్తున్న చిత్రం “పక్కా కమర్షియల్” అల్లు అరవింద్ వారి ‘గీతా ఆర్ట్స్-2’, యువి క్రియేషన్స్ ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో గోపీచంద్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 02:11 PM IST
    Follow us on

    Tollywood: విభిన్నమైన పాత్రలతో వినోదాన్ని పంచడంలో డైరెక్టర్ మారుతి కి ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి‌. ఇటీవలే మారుతి దర్శకత్వంలో విడుదలైన “మంచిరోజులు వచ్చాయి”ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మారుతి దర్శకత్వంలో హీరో గోపీచంద్, రాశి కన్నా జంటగా నటిస్తున్న చిత్రం “పక్కా కమర్షియల్” అల్లు అరవింద్ వారి ‘గీతా ఆర్ట్స్-2’, యువి క్రియేషన్స్ ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో గోపీచంద్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.ఈ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    అయితే సమ్మర్ సీజన్ ఆరంభం కాబట్టి మార్చి చివరి రెండు వారాల్లో సినిమాల రిలీజ్‌కు గట్టి పోటీనే ఉంటుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది విడుదలయ్యే సినిమాలన్నీ భారీ చిత్రాలు అవ్వడం విశేషం.కిరణ్ అనే కొత్త దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా” గని” విడుదలవుతుంది. ముందుగా ” గని” చిత్రాన్ని డిసెంబరు 10నే రిలీజ్ చేయాలనుకున్నారు. తర్వాత 24కు వాయిదా వేశారు. కానీ ఏం జరిగిందో ఏమో మళ్లీ వాయిదా తప్పలేదు. మంచి డేట్ చూసి తర్వాత విడుదల చేస్తామని చివరగా ప్రకటన ఇచ్చారు.ఇప్పుడు చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ‘గని’ని మార్చి 18న విడుదల చేయాలని చూస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.ఐతే ఈ సినిమాకి నిర్మాత ఎవరన్నది ఇక్కడ ప్రస్తావనార్హం. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ ఈ చిత్రంతోనే పూర్తి స్థాయి నిర్మాతగా పరిచయం అవుతున్నారు.
    ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది మార్చిలో విడుదల కావడంతో తండ్రీ కొడుకుల సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేసేస్తారా లేక ‘గని’ కోసమని ‘పక్కా కమర్షియల్’ను మరో తేదీకి వాయిదా వేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. లేదా ఈ రెండూ సినిమాలను ఒకే రోజు వస్తే మాత్రం తండ్రీ కొడుకులైన ఇద్దరు నిర్మాతలు సినిమాలు ఒకే రోజు పోటీ పడ్డ రికార్డు అవుతుందేమో తెలియాలంటే ఈ ఏడాది వరకు ఆగాల్సిందే.