Sonu Sood: కరోనా సమయంలో ఎనలేని సేవలు అందించిన మనిషి ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు సోను సూద్. అంత తేలికగా మర్చిపోయే సేవలు కాదు ఆయన చేసింది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరికి పిలిస్తే పలుకుతాను అనే స్థాయిలో ఆయన సేవ కార్యక్రమాలు చేసాడు. సినిమాల్లో విలన్ గా నటించే సోను సూద్, ఇలాంటి మహోన్నతమైన పనులు చేసి నిజ జీవితంలో హీరో గా నిలిచాడు. సోను సూద్ రాజకీయాల్లోకి వెళ్లి రాబోయే ఎన్నికలలో పోటీ చేయడం కోసమే ఇలా చేశాడని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. సోను సూద్ ఒక పార్టీ లో చేరితే, ఆ పార్టీ కి జనాల్లో ఎంతో పాజిటివ్ ఇమేజ్ వస్తుందని నమ్మి ఆయన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి. కానీ సోనుసూద్ ఆ ఆహ్వానాలను తిరస్కరించాడు. తన సేవ లో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని తేల్చి చెప్పాడు.
కరోనా సమయంలో ఆయన స్థాపించిన ట్రస్ట్ ఇప్పటికీ సేవ కార్యక్రమాలు అందిస్తూనే ఉంది. నేడు సోనూసూద్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ అయ్యాడు. ఇదేదో రాజకీయ లబ్ది కోసం చేసిన భేటీ అనుకుంటే పెద్ద పొరపాటే. తమ సంస్థ నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా ఉచితంగా నాలుగు అంబులెన్సులను ఇచ్చి వెళ్ళాడు. రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఎన్నో ఉచిత అంబులెన్సులు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం సోనూసూద్ గొప్ప మనసుకి ముగ్దుడై, ఆయన్ని ట్విట్టర్ సాక్షిగా పొగడ్తలతో ముంచి ఎత్తుతూ అభినందనలు తెలిపాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సహాయం ఛేస్యలనే నిండు మనసు ఉంటే చాలు, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నిరూపించిన ఉన్నతమైన మనిషి సోనూసూద్.
ఈ సందర్భంగా సోనూసూద్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురిసింది. ఇలాగే సమాజ సేవ చేస్తూ ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని కోరుతూ సోనూసూద్ కి అభినందనల వెల్లువ కురుస్తుంది. ఇదంతా పక్కన పెడితే సోనూసూద్ ఇప్పుడు కేవలం విలన్ గా మాత్రమే కాదు. హీరో గా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి ఆయన హీరోగా నటించిన ‘ఫతేహి’ అనే చిత్రం విడుదలై బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రంలో కేవలం ఆయన హీరో గా మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. తెలుగు లో ఆయన చివరిసారిగా కనిపించిన చిత్రం, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’. ఈ సినిమా తర్వాత సోనూసూద్ మళ్ళీ తెలుగులో కనిపించలేదు. అయ్యానని బాగా మిస్ అవుతున్నామని, హీరో గా చేస్తూనే ప్రధాన పాత్రలు కూడా చేయాలనీ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.