https://oktelugu.com/

కాబోయే ప్రధాని సోనూసూద్.. సోనూ స్పందన ఇదే !

కలియుగ కర్ణుడు అని ‘సోనూసూద్’కి ఒక బిరుదు ఇచ్చారు నెటిజన్లు. అలాగే ఆ మధ్య సోనూకి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు జరిపించిన సంఘటన గురించి కూడా మనం విన్నాం. ఇక సినిమా సెట్స్ లో అయితే మెగాస్టార్ లాంటి వ్యక్తులు కూడా సోనూసూద్‌ కి శాలువా కప్పి సన్మానించడం మనం చూసాం. మొత్తానికి కరోనా ఆపద్బాంధవుడిగా సోనూ చేసిన సేవలు, సాయాలు ముందు ఆయనకి ఎలాంటి సత్కారాలు జరిగిన అవ్వన్నీ చిన్నవే. అయితే తాజాగా సోనూ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 12, 2021 / 12:09 PM IST
    Follow us on

    కలియుగ కర్ణుడు అని ‘సోనూసూద్’కి ఒక బిరుదు ఇచ్చారు నెటిజన్లు. అలాగే ఆ మధ్య సోనూకి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు జరిపించిన సంఘటన గురించి కూడా మనం విన్నాం. ఇక సినిమా సెట్స్ లో అయితే మెగాస్టార్ లాంటి వ్యక్తులు కూడా సోనూసూద్‌ కి శాలువా కప్పి సన్మానించడం మనం చూసాం. మొత్తానికి కరోనా ఆపద్బాంధవుడిగా సోనూ చేసిన సేవలు, సాయాలు ముందు ఆయనకి ఎలాంటి సత్కారాలు జరిగిన అవ్వన్నీ చిన్నవే.

    అయితే తాజాగా సోనూ సూద్‌ భారత్ భవిష్యత్తు ప్రధానిమంత్రి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. సోనూ రాజకీయ నాయకుడిగా చూడాలని ఆయన అభిమానులు గత కొంతకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఇక బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్ అయితే, ఏకంగా సోనూసూద్‌ ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన కామెంట్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.

    అయితే, తాజాగా ఈ కామెంట్స్ పై సోనూసూద్ స్పందించారు. నిన్న మధ్యాహ్నం కొంతమంది సాయం కోసం సోనూ ఇంటి ముందుకు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇక ఇదంతా కవర్ చేయడానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లకు సోనూసూద్‌ సమ్మర్ డ్రింక్స్ అందిస్తూ వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ మిమ్మల్ని ఈ దేశానికి భవిష్యత్తు ప్రధానిగా చూడాలని కొంతమంది ఆశ పడుతున్నారు.

    ఈ వార్త విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ? అసలు మీ స్పందన ఏమిటి ? అంటూ స్పందించమని సోనూసూద్ ను కోరాడు ఆ ఫొటోగ్రాఫర్. అతని ప్రశ్నకు సోనూసూద్ చిన్న నవ్వు నవ్వి సమాధానం చెబుతూ.. ‘నిజంగా నాకు రాజీకీయాల పై ఎలాంటి ఆసక్తి లేదు. నేను కేవలం ఒక సాధారణ వ్యక్తిగానే ఉంటూ, పేదలకు, ఆపదలో ఉన్న ప్రజలకు సేవ చేస్తాను, నాకు అల చేయడమే ఇష్టం’ అంటూ సోనూ క్లారిటీ ఇచ్చాడు.