https://oktelugu.com/

Pub Rides : హైదరాబాద్ లో భారీ రేవ్ పార్టీ: చిక్కిన రాహుల్ సిప్లిగంజ్, నిహారిక, సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు.. వైరల్ వీడియోలు

Pub Rides : హైదరాబాద్ లో భారీ రేవ్ పార్టీ పట్టుబడింది. రేవ్ పార్టీలకు అడ్డగా మారిందన్న విమర్శలు వస్తున్నా.. ఎక్కడా యువత, సెలబ్రెటీలు వెనక్కి తగ్గడం లేదు. యథేచ్ఛగా తెల్లవారుజాము వరకూ పార్టీలు చేసుకుంటూనే ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీ రేవ్ పార్టీలో సినీ, రాజకీయ ప్రముఖులు, వారి పిల్లలు పట్టుబడడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుండింగ్ అండ్ మింక్ పబ్ లో కొన్నరి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 3, 2022 12:40 pm
    Follow us on

    Pub Rides : హైదరాబాద్ లో భారీ రేవ్ పార్టీ పట్టుబడింది. రేవ్ పార్టీలకు అడ్డగా మారిందన్న విమర్శలు వస్తున్నా.. ఎక్కడా యువత, సెలబ్రెటీలు వెనక్కి తగ్గడం లేదు. యథేచ్ఛగా తెల్లవారుజాము వరకూ పార్టీలు చేసుకుంటూనే ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీ రేవ్ పార్టీలో సినీ, రాజకీయ ప్రముఖులు, వారి పిల్లలు పట్టుబడడం కలకలం రేపింది.

    హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుండింగ్ అండ్ మింక్ పబ్ లో కొన్నరి రకాల డ్రగ్స్ బయటపడ్డాయి. ముందుగానే సమాచారం అందడంతో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ రేవ్ పార్టీలో కొకైన్, ఎల్ఎస్.డీ సిగరెట్లు, గంజాయి లభ్యమయ్యాయి.

    ఈ దాడుల్లో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తోపాటు మెగా బ్రదర్ నాగబాబు కూతురు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ బయటపడ్డాయి. దీంతో వీరిద్దరూ ఈ రేవ్ పార్టీలో పాల్గొని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. పబ్ ఓ మాజీ ఎంపీ కుమార్తెదని సమాచారం. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడితో సహా మిగతా వారికి నోటీసులు జారీ చేశారు.

    ఈ పబ్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉండడం.. సీఐ పట్టించుకోకపోవడంతో సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. పబ్ యాజమాన్యమే ఈ డ్రగ్స్ సప్లై చేసినట్టు గుర్తించారు.

    ఈ పబ్ నిర్వాహకులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రముఖుల పిల్లలు కూడా రేవ్ పార్టీలో పోలీసులకు చిక్కారని వార్తలు వస్తున్నాయి. స్టార్ డాటర్ ఇందులో చిక్కినట్టు తెలిసింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్తె కూడా పట్టుబడినట్టు చెబుతున్నారు. వీరందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించిన అధికారులు వారికి కౌన్సిలింగ్ తాజాగా డ్రగ్స్ మందిని ఇంటికి పంపించినట్టు సమాచారం. నోటీసులు ఇచ్చి ఇంటికి పంపినట్లు సమాచారం. మరోసారి స్టేషన్ కు విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.