Sonam Kappor Baby Bump: ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ తన బేబీ బంప్ ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ‘నాలో ఏదో మార్పు మొదలైంది’ అంటూ తొలిసారి తల్లి కావడం సంతోషంగా ఉందని రాసుకొచ్చింది సోనమ్. తాజాగా సోనమ్ కపూర్ షేర్ చేసిన ఈ కొత్త బెవీ బంప్ ఫోటో తెగ వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రెస్‌లో గర్భవతిగా తన బేబీ బంప్ ఫోటోను అభిమానులకు చాలా క్లారిటీగా చూపించింది సోనమ్ కపూర్.
Also Read: Meera Jasmine: మళ్లీ అందాలను ఆరబోసిన మీరా జాస్మిన్
ప్రెగ్నెంట్ గా ఉన్న ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కూడా ఈసారి డిఫరెంట్ లుక్ తో స్టైల్ క్వీన్ అని నిరూపించుకోవడంతో పాటు నెటిజన్లను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
సోనమ్ కపూర్ పెళ్లి ఫోటోలు కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సోనమ్ .. ఇటీవల సీమంతం కూడా గ్రాండ్ గా చేసుకుంది.
అయితే, సోనమ్ కు అందం ఉన్నా, అణుకువ ఉన్నా, అన్నిటికీ మించి మంచితనం ఉన్నా.. ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు.
సోనమ్ కపూర్ చాలా కాలంగా సెకెండ్ లెవల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. దాంతో ఈ హోమ్లీ బ్యూటీ ఎక్కువ సినిమాల్లో నటించలేదు.
కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ.. ఏ చిత్రం సోనమ్ కెరీర్ ను టర్న్ చేయలేకపోయింది. ఎలాగూ సినీ కెరీర్ బాగాలేదు కాబట్టే.. ఆమె పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.
Also Read: Superstar Krishna: ‘సూపర్ స్టార్ కృష్ణ’ సాధించిన ఘనతలు ఇవే.. కృష్ణా సరిలేరు నీకెవ్వరు