https://oktelugu.com/

షాషీద్ కపూర్ తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ భామ

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పక్కన తొలి మూవీతోనే జతకట్టింది. ‘దబాంగ్’ మూవీలో సల్మాన్ కు జోడీగా నటించి మెప్పించింది. ఈ మూవీ బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టుకావడంతో సోనాక్షి సిన్హా ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మూవీ తర్వాత ఆమెకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్టుకావడంతో సోనాక్షి సిన్హా గోల్డెన్ […]

Written By: , Updated On : May 25, 2020 / 07:18 PM IST
Follow us on


బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పక్కన తొలి మూవీతోనే జతకట్టింది. ‘దబాంగ్’ మూవీలో సల్మాన్ కు జోడీగా నటించి మెప్పించింది. ఈ మూవీ బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టుకావడంతో సోనాక్షి సిన్హా ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మూవీ తర్వాత ఆమెకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్టుకావడంతో సోనాక్షి సిన్హా గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే అదే రేంజుల్లో ఈ భామపై గాసిప్స్ మొదలైయ్యాయి. ప్రభుదేవా దర్శకత్వంలో 2013లో వచ్చిన ‘ఆర్.. రాజ్ కుమార్’ సినిమాలో సోనాక్షి సిన్హా షాహిద్ కపూర్ కు జోడీగా నటించింది. ఈ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని.. డేటింగ్ కూడా చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత షాహిద్ కపూర్ 2015లో మీరా రాజ్ పుత్ ని వివాహం చేసుకోవడం డేటింగ్ ప్రచారానికి తెరపడింది.

అయితే తాజాగా ఆ డేటింగ్ వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించింది. తాను షాహిద్ తో డేటింగ్ చేస్తున్న అన్న వార్తల్లో నిజం లేదని.. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. ఖాళీగా ఉంటే కొంతమంది వ్యక్తులు ఇద్దరు పెళ్లి కాని నటిస్తున్నప్పుడు ఇలాంటి రూమర్లు సృష్టిస్తుంటారని తెలిపింది. అయితే ఈ వార్తలేమి తనను బాధపెట్టలేదని.. వీటిని చూసి తాను, షాహిద్ కపూర్ నవ్వుకునే వాళ్లమంటూ సెలవిచ్చింది ఈ భామ. షాహిద్ పెళ్లి తర్వాత కూడా తామిద్దరం మంచి స్నేహితుల్లాగానే కొనసాగుతున్నామని సొనాక్షి చెప్పింది. ఇటీవలే షాహిద్ కపూర్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టు సాధించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీని బాలీవుడ్లో కబీర్ సింగ్ తీసి భారీ విజయం అందుకున్నాడు. కబీర్ సింగ్ మూవీ బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో షాహిద్ కు జోడీగా కియారా అడ్వాణీ నటించింది.